ఆ కేసులో కేసీఆర్‌, హ‌రీష్‌.. జైలుకు హ‌రీష్‌!

Update: 2022-03-07 14:30 GMT
జగ్గారెడ్డి పాస్‌పోర్టు కేసు.. తెలంగాణ‌లో  ఎంత‌టి సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే. త‌ప్పుడు వివ‌రాల‌తో పాస్‌పోర్టు పొంది.. మ‌నుషుల అక్ర‌మ ర‌వాణాకు జ‌గ్గారెడ్డి పాల్ప‌డ్డారంటూ ఆయ‌న‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదైంది. ఆయ‌న జైలుకు కూడా వెళ్లాల్సి వ‌చ్చింది.

అలాంటి పాస్‌పోర్టు కేసులు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న మేన‌ళ్లుడైన ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుకు భాగ‌స్వామ్యం ఉంద‌ని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. టైం బాగ‌లేక‌పోతే హ‌రీష్ రావు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని ఆయ‌నే పేర్కొన్నారు.

ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ జ‌గ్గారెడ్డి పాస్‌పోర్టు కేసు విష‌యంపై హాట్ హాట్ వ్యాఖ్య‌లు చేశారు. 2018లో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముందు ప్రభుత్వంపై నాపై నిఘా పెట్టింది. ఏదో ఒక దాంట్లో ఇరికించాల‌ని హ‌రీష్ రావు చూశారు. కానీ నా ద‌గ్గ‌ర ఏమీ దొర‌క‌లేదు. తెలిసో తెలియ‌కో పాస్‌పోర్టు కేసులో ఉన్నా. నేనే కాదు. నాతో పాటు కేసీఆర్‌, హ‌రీష్ రావు కూడా అందులో భాగ‌స్వామ్యులే. న‌న్ను దాంట్లో జైలుకు పంపించారు. ఆరు నెల‌ల వ‌ర‌కూ బెయిల్ రాద‌నుకున్నారు. కానీ 15 రోజుల‌కే బ‌య‌ట‌కు వ‌చ్చా.

కేసీఆర్‌, హ‌రీష్పైనా కేసు న‌మోదు చేయ‌మ‌ని కోర్టును అడుగుతా. వాళ్ల‌ను ఎందుకు వ‌దిలిపెట్టాలి? హ‌రీష్ రావు, కేసీఆర్ కూడా ఓ సారి జైలుకు వెళ్తే తెలుస్తుంది. టైం బాగా లేక‌పోతే హ‌రీష్ క‌చ్చితంగా పోవాల్సి వ‌స్తుంది. హ‌రీష్‌కు ఆ బాధ తెలియాలి. కేసీఆర్‌కు రాజ‌కీయ ప‌రంగా ఎప్పుడైనా ప్ర‌మాదం జ‌రిగితే అది క‌చ్చితంగా హ‌రీష్ కార‌ణంగానే జ‌రుగుతుంది. ఆయ‌న ముందు తీయ‌గా.. వెన‌కాల మ‌రో ర‌కంగా మాట్లాడుతారు. హ‌రీష్‌కు మేన‌మామ కేసీఆర్ స్వభావం వ‌చ్చింది అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.

2004లో జ‌గ్గారెడ్డి.. నిర్మ‌ల‌, విజ‌య‌ల‌క్ష్మీ, భ‌ర‌త్‌ల‌ను కుటుంబ స‌భ్యులుగా చూపిస్తూ ఎమ్మెల్యే హోదాలో పాస్‌పోర్టులు పొందారు. ఆ తర్వాత వాళ్ల‌ను అమెరికా తీసుకెళ్లి అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చారు. త‌న పాస్‌పోర్టు పోయింద‌ని 2016లో కొత్త దాన్ని తీసుకున్నారు.

ఆ స‌మ‌యంలోనే త‌న అస‌లైన కుటుంబ స‌భ్యుల వివ‌రాల‌ను సేక‌రించిన పోలీసులు జ‌గ్గారెడ్డిపై కేసు పెట్టారు. ఆ ముగ్గురిని అమెరికా త‌ర‌లించేందుకు రూ.15 ల‌క్ష‌లు తీసుకున్నార‌ని ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లున్నాయి.
Tags:    

Similar News