సింగరేణి బొగ్గు బ్లాక్ ను ప్రైవేటుకు కట్టబెట్టింది కేసీఆరే.. తేల్చేసిన కేంద్రమంత్రి
రెండు రోజుల క్రితం ఒక ప్రైవేటు మీడియా సంస్థకు చెందిన చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ కాంగ్రెస్ నేత కమ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు భారీ బొగ్గు కుంభకోణానికి తెర తీసిందని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాల్ని ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చినట్లుగా పేర్కొనటం తెలిసిందే. అసలు బొగ్గు స్కాం ఏమిటి? అందులో కేసీఆర్ సర్కారు పాత్ర ఏమిటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మరింత కాక పుట్టేలా తయారు చేస్తున్నట్లుగా చెప్పాలి.
సింగరేణిలోని తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ను తెలంగాణలోని కేసీఆర్ సర్కారే ప్రైవేటుకు అప్పజెప్పిందన్న విషయాన్ని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతేకాదు.. మరో నాలుగు బొగ్గు బ్లాకులనుప్రైవేటుకు అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని సింగరేణికి అప్పజెప్పేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పవర్లోకి వచ్చిన తర్వాత సింగరేణిని.. కార్మిక హక్కుల్ని నిర్వీర్యం చేస్తోందని ఘాటు ఆరోపణను సంధించారు.
అంతేకాదు.. పలు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.23 వేల కోట్లను చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. అంతేకాదు కేంద్రం పరిధిలో ఉండే కోల్ ఇండియా సంస్థలకు కల్పిస్తున్న హక్కులు.. సౌకర్యాలను సింగరేణి కార్మికులకు కల్పించటం లేదెందుకు? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే కార్మికులకు ఐటీ చెల్లిస్తామని.. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామన్న భారీ తాయిలాన్ని ప్రకటించారు.
ఇప్పటివరకు బొగ్గి మసికి దూరంగా ఉన్న కేసీఆర్.. ఇటీవల కాలంలో ఆయనకు బొగ్గుకు లింకు పెట్టేస్తున్న వైనం రానున్న రోజుల్లో రాజకీయంగా తీవ్ర ప్రతికూలత ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. మరి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కానీ ఆయన కుమారుడు కేటీఆర్ కానీ సమాధానం ఇస్తారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. మరి దీనికి గులాబీ బాస్ ఏమని బదులిస్తారో?