రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఎవరూ ఉండరు. ఎవరు అవునన్నా.. కాదాన్నా కాంగ్రెస్ చేతిలో తిరుగులేని అధికారం ఉన్న వేళ జానారెడ్డి ఇమేజ్ ఎంతలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వేళలో.. తెలంగాణ సెంటిమెంట్ తో పోరాడుతున్న కేసీఆర్.. తనకు ఏదైనా అవసరం వచ్చినంతనే జానాను లైన్లో తీసుకునేవారు. ఏ మాటకు ఆ మాట.. తన చేతిలో పవర్ ఉన్నప్పటికి కేసీఆర్ ను తక్కువగా చూడటం.. ఆయన్ను దగ్గరకు రానివ్వకుండా చేయటం లాంటివి చేయలేదనే చెప్పాలి.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు..కాంగ్రెస్ అధినాయకత్వం మీద ఒత్తిడిని పెంచాలన్న ప్రతిసందర్భంలో ఒక్క జానా మాత్రమే కాదు.. ఏ కాంగ్రెస్ సీనియర్ నేతను కేసీఆర్ సంప్రదించినా.. వారు కాదనేవారు కాదు. కేసీఆర్ కు సాయం అందించటాన్నితమవారికి తాము చేసుకుంటున్న మేలుగా భావించేవారు. అలాంటి వారు.. ఈ రోజున కేసీఆర్ తీరుకు విస్మయానికి గురవుతున్నారు. ప్రస్తుతం సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా సీనియర్ అయిన జానారెడ్డి ఓటమే లక్ష్యంగా కేసీఆర్ కదుపుతున్న పావుల వేగాన్ని తెలుసుకొని కాంగ్రెస్ పెద్దాయన తెగ ఫీల్ అవుతున్నారని చెబుతున్నారు.
మీడియాలో పెద్దగా కనిపించని జానా.. తన శక్తివంచన లేకుండా సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వారు వేసే ఎత్తులకు పైఎత్తులు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ మాదిరి హడావుడి చేయకుండా సైలెంట్ గా ఎన్నికల్ని ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. తనకు అండగా నిలిచే వారు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన జానా.. తాను ఎవరి మీదా ఆధారపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ కు కాస్త ముందుగా చేపట్టాల్సిన వాటికి అవసరమైన అన్నింటిని ముందస్తుగానే పక్కాగా సిద్ధం చేశారని తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే ఈ ఎన్నికను ఏదోలా గెలవాలన్న తపన ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే.. ప్రస్తుత పరిస్థితులు గతంలో మాదిరి పరిస్థితులు సానుకూలంగా లేదన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. గులాబీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి పార్టీ అధినేతే స్వయంగా రంగంలోకి దిగటమే కాదు.. పరకాల ఎపిసోడ్ లో ఎదురైన చేదు అనుభవం ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ కాకుండా ఎక్కడికక్కడ పకడ్భందీ చర్యల్ని చేపట్టారు. అంతేకాదు.. ఇటీవల ఎమ్మెుల్సీ ఎన్నికల్లో వర్కువుట్ అయిన యాభై ఓట్లకు ఒక్క ఇంఛార్జిని.. అలాంటి ఇన్ ఛార్జి మీద మరో ఇద్దరిని ఏర్పాటు చేసి.. తాము టార్గెట్ చేసిన ఏ ఒక్క ఓటు మిస్ కాకూడదన్న లక్ష్యంతో ఉన్నారు. ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్న వేళ.. సాగర్ ఓటరు ఎవరివైపు ఉన్నారు? వారిని ఎవరు బాగా ప్రభావితం చేశారన్నది తేలాలంటే.. వచ్చే నెల 2న తేలిపోనుంది.