తెలంగాణ 'పాలపిట్ట'తో సమస్యల్లో పడ్డ కేసీఆర్

Update: 2022-10-07 07:45 GMT
దసరా పండుగ నాడు తెలుగు రాష్ట్రాల్లో పాలపిట్టను చూస్తే ఎంతో పుణ్యం పురుషార్థం అన్న టాక్ ఉంది. అందుకే పాలపిట్టను చూసేందుకు అందరూ గ్రామ పరిసరాలకు వెళుతుంటారు. ఇది చూస్తే శుభం కలుగుతుందని జనం నమ్ముతారు. అయితే రోజురోజుకు ఈ పక్షి అంతరించిపోతోంది. బయట ప్రపంచంలో ఎక్కడా కనిపించడం లేదు.

అయితే తాజాగా  తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల కోసం  పాలపిట్టని బోనులో బంధించి ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారు. కేసీఆర్, ఆయన మనవడు హిమాన్షు, కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బోనులో ఉన్న పక్షిని పట్టుకున్న చిత్రాలు మీడియాలో రావడంతో తీవ్ర దుమారం రేగింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం, పాలపిట్టని పంజరంలో బంధించడం నేరం. చట్టంలోని షెడ్యూల్ 1 నుండి 4 వరకు వ్యక్తిగత లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం పంజరంలో బంధించడం నేరమని.. ప్రిపరేటర్‌లు చట్ట ప్రకారం శిక్షించబడతారని సూచిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డుకు సీఎం కేసీఆర్ స్వయంగా చైర్మన్‌గా ఉండి చట్టాన్ని ఉల్లంఘించడం మరింత ఆశ్చర్యకరమని పలువురు విమర్శిస్తున్నారు.

దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పక్షి ప్రేమికులు మండిపడుతున్నారు. అంతరించిపోతున్న పక్షిని కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులను చూసేందుకు ప్రగతి భవన్‌కు పంజరంలో తీసుకొచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి అని, దీన్ని ఇలా పంజరంలో బంధించి తేవడం దారుణమని .. ఇది సిగ్గుమాలిన చర్య అని అందరూ ఖండిస్తున్నారు. ఈ వివాదంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News