విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది... విజయం యుద్దంలో మేళకువలు నేర్పుతుంది.... విజయం పట్టుదలను పెంచుతుంది..... విజయం లక్ష్యాన్ని విస్తారిస్తుంది ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులో కనిపిస్తున్న లక్షణాలు. తెలంగాణలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన దూకూడు పెంచారు కల్వకుంట్ల వారు. ముందు తానొక్కడే ప్రమాణం చేస్తాడని అందరూ భావించిన తనతో పాటు ముస్లిం మైనారిటీకి చెందిన మహమూద్ ఆలీ చేత కూడా ప్రమాణం చేయించారు. దేశ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీల ఓటు బ్యాంకును తాను తన మిత్రుడు అసదుద్దీన్ ఒవైసీ కొల్లకొడతామని చేసిన ప్రకటనకు మహమూద్ ఆలీ ప్రమాణ స్వీకారం నాందీ వాచకం అంటున్నారు. ఇది జరిగిన మర్నాడే తన కుమారుడు కె. తారక రామారావును టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేసారు. దీని వెనుక - ఇక ముందు ముందు తాను జాతీయ రాజకీయాలలో తలమునకలై ఉంటానని సందేశం ఇచ్చినట్లు అయ్యిందని అంటున్నారు.
రానున్న రోజులలో కె.చంద్రశేఖర రావు తన దూకూడు మరింత పెంచి జాతీయ స్దాయిలో ఫెడరల్ ఫ‌్రంట్ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తానంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే జాతీయ స్దాయిలో కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలు చేస్తారని అంటున్నారు. ఇందుకు పార్టీ పనులు అడ్డంకిగా మారకూడదనే ఆ బాధ్యతలను కుమారుడు కె. తారక రామారావుకు అప్పగించారంటున్నారు.
తెలంగాణలో మరో వారం లేక పదిరోజులలో పూర్తి స్దాయిలో క్యాబినెట్ విస్తరణ చేసి అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలకు కేసీఆర్ వెళతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనల కోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ - దేవేగౌడ - స్టాలిన్ వంటి నాయకులను కేసీఆర్ కలుసుకున్నారు. మలివిడతగా ఈ నెలాఖరున కాని జనవరి మొదటి వారంలో వివిధ రాష్ట్రాల నాయకులను కలసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున దూకూడుగా వ్యవహరిస్తారని అంటున్నారు.