దేశంలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది నేతల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి దేశవ్యాప్తం ఫాలోయింగ్ ఉంది.. ఆన్ లైన్ - ఆఫ్ లైన్లో కూడా ఆయన కింగే. ఇక రాష్ట్రాల విషయానికొస్తే తమిళనాడులో దివంగత సీఎం జయలలితకు అక్కడ తిరుగులేని సంఖ్యలో అభిమానులున్నారు. బెంగాల్ లో మమత బెనర్జీకీ కూడా అంతే. తెలుగు రాష్ర్టాల్లోనూ చంద్రబాబు - జగన్ - కేసీఆర్ లకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అయితే.. కేసీఆర్ కు మాత్రం తెలంగాణలో హార్డ్ కోర్ ఫ్యాన్సు ఉన్నారు. కానీ... సోషల్ మీడియాలో కేసీఆర్ కు ఉన్న అభిమానులెందరంటే క్వశ్చన్ మార్కే. కారణం.. ఆయన సోషల్ మీడియాలో లేకపోవడమే. ఇకపై ఆ లోటు కూడా తీర్చేస్తున్నారు కేసీఆర్. తాజాగా ఆయన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేశారు. దీంతో ఆయన అభిమానుల్లో సందడి మొదలైంది. సోషల్ మీడియాలో తమ నేత ఇక దూసుకుపోతారని.. దేశంలోనే టాప్ లో నిలుస్తారని చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక ఫేస్ బుక్ పేజీని తెరిచారు. కేసీఆర్ పేరుతో ఇప్పటికే పలు ఫేస్ బుక్ పేజీలు ఉన్నా అవేవీ అఫీషియల్ కావు. అన్నీ నకిలీవే. తాజాగా కేసీఆర్ క్రియేట్ చేసుకున్న ఈ పేజీని ఫేస్ బుక్ సంస్థ ఆమోదించి, వెరిఫైడ్ మార్క్ ను పెట్టింది.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అందరూ ఆన్ లైన్ లావాదేవీల బాటపట్టాలని, అంతర్జాలం గురించి అవగాహన పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను కూడా ఆన్ లైన్ లో యాక్టివ్‌గా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అధికారికంగా ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించారు. ఇన్ని రోజులు కేసీఆర్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాల్లో ఆయన ప్రసంగాలను - ఫొటోలను ఉంచేవారు. అయితే అవి కేసీఆర్ ఫాలో అవుతున్న అకౌంట్లు కాదు. ఆయన పేరుతో పలు అకౌంట్లు ఉండడంతో నెటిజన్లు తికమకపడేవారు. వాటిల్లో ఏ ఖాతా కేసీఆర్ కి చెందిన నిజమైన ఖాతానో తెలియక అయోమయపడేవారు. ఇప్పుడు కేసీఆర్ అధికారిక ఖాతా తెరవడంతో కేసీఆర్ పేరుపై ఉన్న నకిలీ ఖాతాలన్నింటినీ మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఫేస్ బుక్ సంస్థను కోరింది. కేసీఆర్ ఇటీవలే పెద్దనోట్ల రద్దుపై శాసనమండలిలో ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రసంగాన్ని కేసీఆర్ తన అధికారిక పేజీలో షేర్ చేశారు.
అంతేకాదు ఫేస్ బుక్ లైవ్ ద్వారా కేసీఆర్ త్వరలోనే తన ఫాలోవర్లతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనను అడుగుతున్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పనున్నారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీకి ఫుల్ సపోర్టు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో లైవ్ లు ఇవ్వడంలోనూ మోడీనే ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు తాజా అప్ డేట్ తో కేసీఆర్ పై చిన్నపాటి సెటైర్లూ పడుతున్నాయి. ఇప్పటికే ఆయన తన ఫాంహౌస్ కే ఎక్కువగా పరిమితం అవుతున్నారని.. ఇక ఫేస్ బుక్ లైవ్ లో ప్రసంగాలు చేయడం మొదలుపెట్టి.. అందులోనే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే హైదరాబాద్ రావడం మానేస్తారేమో అని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/