తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. సంక్రాంతి పండుగకు తెలంగాణ కొత్త క్యాబినెట్ కొలువుతీరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సారి మంత్రివర్గంలో వయసు మీరిన వారికి అవకాశాలు దాదాపుగా లేనట్లే అంటన్నారు. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ముద్ర ఉండేలా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో యువకులతో పాటు మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయాలు తీసుకుంటారంటున్నారు.
ముందుగా ఆరుగురితో ప్రమాణం చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇందులో కచ్చితంగా ఇద్దరు మహిళలు, ముగ్గురు యువకులు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన చామకుర్తి మల్లారెడ్డి, బాల్క సుమన్ లకు మంత్రి పదవులు ఖాయమని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వీరికి మంత్రి పదవులు ఇవ్వడంలో భాగంగానే వీరిద్దరిని శాసనసభకు పంపించారని అంటున్నారు.
ఈ ఇద్దరు నాయకుల్లో బాల్క సుమన్ కు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆశీసులు ఎక్కువగానే ఉన్నాయి. చామకుర్తి మల్లారెడ్డి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. దీంతో వీరిద్దరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమంటున్నారుు. ఇక గత మంత్రి వర్గంలో మహిళలకు కనీస ప్రాధాన్యం కూడా లేకుండా పోయింది. దీంతో ఈసారి ఇద్దరు మహిళా శాసనసభ్యులకు మంత్రి పదవులు, స్పీకర్ కాని, డిప్యూటీ స్పీకర్ వంటి పదవి కాని దక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ సీనియర్లతో చర్చించినట్లు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు తమకు ఎక్కువ మద్దతు తెలిపారని అంచనాకు వచ్చిన కె.చంద్రశేఖర రావు వారిని మరింత ప్రసన్నం చేసుకుందుకు మహిళా శాసనసభ్యులకు పదవులు కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు.
Full View