అసమ్మతి సెగకు...కేసీఆర్ పొగ

Update: 2018-10-01 06:36 GMT
తెలంగాణ రాష్టంలో ముందస్తు ఎన్నికలకు అభ్యర్దులను  ప్రకటించిన విషయం విదితమే. తెరాస టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నాయుకులు తెరాస అధిష్టానంపైన తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. కొండా సురేఖ - బాబుమోహ‌న్ వంటి వారు పార్టీని విడిచి వెళ్లిపోయారు కూడా. అయితే చివరి నిమిషం వరకూ ప్రయత్నించి భంగపడ్డ నాయకులు మాత్రం తమ అధిష్టానంపై సెగలు కక్కుతున్నారు. అంతేకాకుండా  తన నియోజకవర్గంలోని అభ్యర్దులపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అటువంటి నాయకులను బుజ్జగించే పని కేటీఆర్‌ కు అప్పగించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా కేటీఆర్ అదే పనిలో ఉన్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితీదే విజయమని - గెలుపు తర్వాత భంగపడ్డ నాయకులకు కోర్పరేషన్ - ఎమ్మెల్సీ పదవులను తాయిలాలుగా చూపించి బుజ్జగిస్తున్నారు. అయితే తాయిలాలకు లొంగని నాయకులను పట్టించుకోవద్దంటూ తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించినట్టు సమాచారం. 

టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ నాయకుడైన కెసీఆర్ ‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూనే - తమ నియోజకవర్గ అభ్యర్దిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్దులు స్వతంత్రంగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ముక్తల్ వంటి నియోజకవర్గలలో తెరాస అభ్యర్దియైన రాంమోహన రెడ్డి మార్చాలంటూ నిన్న ఆదివారం నాడు ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం గమనార్హం. నియోజవర్గాలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలను ఎంత బుజ్జగించినా - వ్యతిరేక ప్రచారాన్ని ఆపకపోగా కొంతమంది నేతలు సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారు. ఇటు వంటి అసమ్మతి నాయకుల కదలికలపై ఎప్పటికప్పుడు కెసీఆర్ ద్రుష్టి పెడుతున్నాట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నాయకుల గూర్చి పట్టించుకోకుండా - ఆ నియోజకవర్గాలలో గెలుపు కోసం ఎక్కువగా ద్రుష్టి పెట్టాలని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలు గడప గడపకి తీసుకుని వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. చివరిసారిగా అసమ్మతి నేతలతో మరోసారి మాట్లాడాలని - అప్పటికి వినకపోతే వారి కర్మనా వారిని వదిలివేయండి అని కెసీఆర్ అన్నట్లు సమాచారం. తమ నాయకుడు కెసీఆర్ ఇచ్చిన భ‌రోసాతో తెరాస అభ్యర్దులలో కొత్త ఉత్సాహం వచ్చిందని పలువురు అంటున్నారు. ఇకపై తెరాస గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని. కెసీఆరే మా నినాదం - తమ నాయకుడైన కెసీఆర్ విధానాలు తమను గెలిపిస్తాయని వారు అంటున్నారు.
   

Tags:    

Similar News