రామోజీ ఇంట పెళ్లి పిలుపులు మొద‌ల‌య్యాయి

Update: 2017-07-04 05:25 GMT
మీడియా మొఘ‌ల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన వ్య‌క్తుల్లో ఒక‌రిగా అభివ‌ర్ణించే ఈనాడు రామోజీ రావు ఇంట జ‌రుగుతున్న పెళ్లి కార్య‌క్ర‌మం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రామోజీ సంతానం పెళ్లిళ్ల త‌ర్వాత జ‌రుగుతున్న మొద‌టి పెళ్లిగా  చెప్పాలి. రామోజీ పెద్ద కుమారుడు.. ఈనాడుఎండీ కిర‌ణ్.. శైల‌జ‌ల పెద్ద కుమార్తె స‌హ‌రి వివాహం ఈ నెల చివ‌రి వారంలో (జులై 28న‌) జ‌ర‌గ‌నుంది.

ఆ మ‌ధ్య‌న కుటుంబ స‌భ్యులు.. అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య నిశ్చితార్థం వేడుక‌లు రామోజీ ఫిలింసిటీలో జ‌రిగాయి. తాజాగా.. పెళ్లి ద‌గ్గ‌ర ప‌డ‌టంతో కీల‌క‌మైన పిలుపుల కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. తాజాగా.. రామోజీ పెద్ద కుమారుడు కిర‌ణ్ స్వ‌యంగా వెళ్లి.. ప్ర‌ముఖుల‌కు పెళ్లి శుభ‌లేఖ‌లు అందించే కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లిన కిర‌ణ్‌.. త‌న కుమార్తె పెళ్లి శుభలేఖ‌ను కేసీఆర్ దంప‌తుల‌కు ఇచ్చారు. పెళ్లికి త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌నికోరిన‌ట్లుగా తెలుస్తోంది.

దాదాపు మూడు రోజుల‌కు పైనే పెళ్లి కార్య‌క్ర‌మాన్ని రామోజీ ఫిలింసిటీలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ పెళ్లి వేడుకుల‌కు కుటుంబ స‌భ్యులు.. ఎంపిక చేసిన ప్ర‌ముఖుల‌ను మాత్ర‌మే ఆహ్వానిస్తార‌ని చెబుతున్నారు. అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించే పెళ్లి వేడుక‌పై భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌న‌మ‌రాలి పెళ్లిని భారీగా చేసేందుకు వీలుగా.. ఇప్ప‌టికే ఫిలింసిటీలో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విషయం ఏమిటంటే.. తెలుగు గురించి త‌ర‌చూ మాట్లాడే రామోజీ.. త‌న మ‌న‌మ‌రాలి పెళ్లి శుభ‌లేఖ‌ను మాత్రం ఇంగ్లిషులోనే అచ్చేయించిన‌ట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే.. దీనికి సంబంధించిన శుభ‌లేఖ కొంద‌రికి మాత్ర‌మే అందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ శుభ‌లేఖ బ‌య‌ట‌కు వ‌స్తే కానీ.. ఈ మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది తెలిసే వీలుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News