యాగానికి కేసీఆర్ వీడియోకాల్ పిలుపులు

Update: 2015-12-16 04:46 GMT
తాను నిర్వహిస్తున్న అయుత చండీయగానికి సంబంధించి పిలుపుల ప్రక్రియను మరింత వేగవంతం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే రాష్ట్రపతి.. పలువురు కేంద్రమంత్రులు.. గవర్నర్లు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులను స్వయంగా వెళ్లి ఆహ్వానించిన ఆయన.. ఇప్పుడు సమయం తక్కువగా ఉండటం.. పిలవాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొత్త రీతిలో పిలుపులు షురూ చేశారు.

అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సాయంతో ఈ నెల 23నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీయాగానికి సంబంధించి పిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ అధ్యాత్మిక గురువు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ ను కేసీఆర్ ఆహ్వానించారు. ప్రస్తుతం షిల్లాంగ్ లో ఉన్న ఆయన్ను పిలిచేందుకు వీడియో కాల్ సౌకర్యాన్ని వినియోగించిన ఆయన.. తాను వ్యక్తిగత హోదాలో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఇక.. కర్ణాటకలోని శృంగేరీ పీఠానికి స్వయంగా వెళ్లనున్న కేసీఆర్.. పీరాథిపతి భారతీతీర్థను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇందుకోసం బుధవారం కర్ణాటకకు వెళ్లనున్నారు. ఓపక్కన ఆన్ లైన్ లోనూ.. మరోపక్క ఆఫ్ లైన్ లోనూ పిలుపుల హడావుడిలో కేసీఆర్ ఉన్నట్లుగా ఉంది.
Full View

Tags:    

Similar News