మరికొద్ది నెలల్లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది తెలంగాణ సర్కారు. ఇందులో భాగంగా.. ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న ఏప్రిల్ 26 నుంచి 29వరకు జరిపే ఉత్సావాలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన కేసీఆర్.. ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత.. దేశ ప్రధానిగా విశిష్ట సేవల్ని అందించిన పీవీ నరసింహారావు సైతం ఉస్మానియా విద్యార్థేనని చెప్పిన కేసీఆర్.. తప్పనిసరిగా శతాబ్ది వేడుకలకు హాజరుకావాలని కోరారు.
పీవీ మాటతో పాటు.. దేశంలోని అత్యంత పురాతన వర్సిట్లీలో ఓయూ ఏడో స్థానం నిలిచిందంటూ వర్సిటీ గొప్పతనాన్ని చెప్పిన కేసీఆర్ మాటలతో రాష్ట్రపతి తన ప్రోగ్రామ్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి జరగన్న వాదనలో నిజం లేదని.. గడిచిన ఏడాది తెలంగాణరాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లటమే కాదు.. ఈ ఏడాది 19.5 శాతం వృద్ధి రేటును సాధించిన విషయాన్ని ప్రణబ్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పటానికి తెలంగాణ రాష్ట్ర ఉదంతమే నిదర్శనంగా కేసీఆర్ చెప్పినట్లుగా సమాచారం. పిలుపుల కోసం వెళ్లి.. ఈ గొప్పలు చెప్పుకోవటం ఏమిటో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/