పెద్దపెద్ద హామీలిచ్చి ఆ తరువాత వాటిని పక్కనపెట్టేయడం బాగా అలవాటయిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాకివ్వడానికి ఆ పార్టీకే చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఒకరు రెడీ అవుతున్నారు. దళితుడికి సీఎం పదవి.. దళితులకు మూడెకరాల భూమి.. జర్నలిస్టులకు పేద్దపేద్ద ఇళ్లు వంటి ఎన్నో శుష్క వాగ్దానాలిచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటిని అటకెక్కించేసిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పుడు కేసీఆర్ ను ఇందులో ఓ హామీ విషయంలో ఇరుకునపెట్టేందుకు తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రెడీ అవుతున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్యను కేసీఆర్ అవమానకరరీతిలో తొలగించారు. ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం చెల్లాచెదురైంది. దీంతో.. కేసీఆర్ ను నేరుగా ఎదుర్కొనడం కష్టమని గుర్తించిన రాజయ్య ఇప్పుడు ఆయన్ను ఇరుకునపెట్టే ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది. రాజయ్య తాజా వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.
తెలంగాణలో ఉన్న దళితులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. కేవలం అర్హత కలిగిన దళితులకు మాత్రమే మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం భూముల రేట్లు పెరిగిపోయాయని... ఎక్కడా భూములు దొరకడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరుదామని సూచించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు.
ఎస్సీల్లో మాదిగలే ఎక్కువగా నష్టపోయారని రాజయ్య అన్నారు. మాదిగల్లోని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే వారు పోరాటం చేయాలని చెప్పారు. మాదిగ ఉప కులానికి చెందిన కడియం శ్రీహరి 18 ఏళ్లు మంత్రిగా పని చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ - మాదిగల అభివృద్ధి కోసం మాదిగ సంఘాలు - మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఆర్థికంగా తిరోగమనంలో ఉన్న దశలో దళితుల్లో అర్హులకు రూ.30 లక్షల చొప్పున ఇవ్వాలన్న డిమాండ్ మొదలైతే అది కచ్చితంగా కేసీఆర్‌కు తలనొప్పి తేవడం ఖాయం. ఇదంతా ఊహించే రాజయ్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.