తెలంగాణ సీఎం కేసీఆర్ .. భారత రాష్ట్ర సమితి అంటూ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర వాదంతో నెగ్గుకొచ్చినట్లు జాతీయ స్థాయిలోనూ గెలవాలంటే.. అత్యంత ప్రభావవంతమైన అంశం అవసరం. దానిని ప్రజల్లోకి తీసుకెళ్తే అదే స్థాయిలో స్పందన కూడా రావాలి. ఉదాహరణకు తెలంగాణ వాదం పేరిట 2001లో ప్రత్యేక పార్టీ పెట్టి సొంత రాష్ట్ర సాధనకు బయల్దేరిన సమయంలో.. తెలంగాణ పట్ల ప్రేమ, ఆపేక్ష ఉన్నవారు అందరూ సంఘటితమయ్యారు. అలా ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ.. ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ పోరాట పటిమతో 2014 కల్లా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అప్పటినుంచి అంతా చరిత్రే. అయితే, తెలంగాణ సాధన వంటి చారిత్రక అవసరం పూర్తవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చూపు నిలిపారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీవి వాగాడంబరమే తప్ప చేతలు లేకపోవడం కేసీఆర్ కు ప్రస్తావించదగిన అంశమైంది. కాగా, ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రధానిగా, కేసీఆర్ తెలంగాణ సీఎంగా కొనసాగారు. ఇద్దరి పాలనను బేరీజు వేస్తే కేసీఆర్ కే కాస్త ఎక్కువ సానుకూలత కనిపిస్తుంటుంది.
తెలంగాణలో తాజా కుట్రను ఆధారం చేసుకుని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు.. ఫాంహౌస్ వేదికగా రూ.400 కోట్లతో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల
కొనుగోలు అంశం. ఇప్పుడిదే అంశంపై తెలుగు మీడియా హోరెత్తుతుండగా జాతీయ మీడియా కూడా అందుకుంటోంది. దీంతో తెలంగాణ బీజేపీ సీబీఐ, సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు అంటూ డిమాండ్ చేస్తోంది. వాస్తవాలు ఏమున్నా.. నోట్ల కట్టలతో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అత్యంత సంచలనం రేపుతోంది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే పలుసార్లు ప్రస్తావన వివిధ రాష్ట్ట్రాల్లో ప్రత్యర్థి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వాలను పడగొట్టిందంటూ కేసీఆర్ పలుసార్లు విమర్శించారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రయాణం నేపథ్యంలో.. ఇప్పుడు తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు జరిగాయియని ఆయన ఆరోపించే అవకాశం ఉంటుంది. దీనికితగ్గట్లే మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర తదితరచోట్ల ప్రభుత్వాలను కూల్చేందుకు మోదీ-షా ద్వయం పథకాలను కేసీఆర్ ప్రస్తావించే వీలుంది. రాజస్థాన్ లోనూ సచిన్ పైలట్ ను అడ్డుపెట్టుకుని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసి విఫలమైన వైనాన్నీ కేసీఆర్ గట్టిగా నొక్కి చెప్పొచ్చు.
ఎన్నికైన ప్రభుత్వాలను పడగొడతారా అంటూ? రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన సంప్రదాయం. ఇది చాలా కాలం పాటు కొనసాగి రాజకీయాల్లో ఓ దుష్ట సంప్రదాయంగా మిగిలింది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ సైతం ఇలాంటి పన్నాగానికి బాధితులే. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలు ఎంతగానో బలపడ్డాయి. కాగా, దీనిని మోదీ-షా ద్వయం తెరపైకి తెచ్చి.. మరో పద్ధతిలో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వాలను పడగొట్టకుండా.. అధికారంలోని పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ఫిరాయింపులకు మరో రూపం ఇచ్చింది. అయితే, తమ పార్టీ, ప్రభుత్వం జోలికి రాకున్నా.. కేసీఆర్ ఈ తరహా ప్రయత్నాన్ని పలుసార్ల మీడియా ముఖంగా నిలదీశారు. ఓ దశలో టీఆర్ఎస్ లోనూ ఏక్ నాథ్ షిండేలు ఉన్నారన్న ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అన్ని పార్టీలను ఏకం చేస్తారా..? రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మోదీ-షా పడగొట్టిన వైనాన్నికేసీఆర్ జాతీయాంశంగా చూపుతూ వివిధ రాష్ట్రాల్లోని పార్టీల నేతల మద్దతును కూడగట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ కు ముందుగా జాతీయ స్థాయిలో మద్దతు దక్కేది కాంగ్రెస్ నుంచే అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే మోదీ-షా ఎత్తుల్లో చిత్తయినది ఆ పార్టీనే కాబట్టి. ఇక ప్రతిపక్ష బెంగాల్ లోని మమతా బెనర్జీ, బిహార్ లోని జేడీయూ, మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ మద్దతు తప్పక దక్కుతుంది. చూద్దాం.. కేసీఆర్ జాతీయ స్థాయిలో ఈ అంశంతో ఎలా ముందుకెళ్తారో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.