ఫెడరల్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మంత్రివర్గాన్ని కూడా పూర్తి స్తాయిలో విస్తరించకుండా దేశం బాట పట్టారు. ఒడిషా నుంచి మొదలైన ఆయన ప్రస్తానం బెంగాల్ మీదుగా ఢిల్లీ చేరింది. ఫ్రంట్ కు ప్రాంతీయ పార్టీలను కూడగట్టే దిశగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతోనే. అసెంబ్లీలో విజయం సాధించి.. పార్లమెంట్ సీట్లను చుట్టేయలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. పనిలో పనిగా తన సీట్లో కుమారుడు కేటీఆర్ ను కూర్చుండబెట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు కేసీఆర్ ను ఎదురించే అవకాశాలు లేవు. దీంతో సాఫీగా జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి సారించారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే కేసీఆర్ ఖచ్చితంగా పార్లమెంటుకు వెళ్లాలి. అందుకోసం ఎంపీగా పోటీచేయాలి. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అందుకే తన ఉద్యమకాలం నుంచి కలిసివచ్చిన.. తెలంగాణ రాష్ట్ర సమితికి ఊపిరిలూదిన కరీంనగర్ నుంచే ఎంపీగా పోటీచేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఉద్యమకాలంలో కేసీఆర్ రాజీనామా చేసిన ప్రతిసారి కరీంనగర్ ప్రజలు ఆయన్ను ఎంపీగా గెలిపించారు. ఈసారి జాతీయ రాజకీయాలను కూడా కరీంనగర్ నుంచే పోటీచేసి శాసించాలని కేసీఆర్ భావిస్తున్నారట.. అందుకే రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీచేయబోతున్నారనే వార్త గులాబీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. అదే సమయంలో కేటీఆర్ సీఎంగా కావడం కన్ఫం అని కూడా చర్చించుకుంటున్నారు.