పెళ్లి వేడుకులకు వచ్చిన కేసీఆర్.. జగన్.. ఎందుకని కలుసుకోలేదు?

Update: 2019-10-19 07:27 GMT
ఒక పెళ్లి వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకావటం కొత్త విషయం ఎంత మాత్రం కాదు. కాకుంటే.. ఇలాంటి వేళలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఎదురెదురుపడటం.. కలవటం కొత్తేం కాదు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన సీన్ ఎదురైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాంరెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తిల వివాహం జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరయ్యారు.

ఏపీ సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి భారతితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుడు బలరాం రెడ్డి బంధువు కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వేడుకకు కాస్త ఆలస్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

అయితే.. అప్పటికే జగన్ వెళ్లిపోవటంలతో వారిద్దరూ కలవలేదు. నిన్న అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు వేడుకుల కోసం వచ్చారు. ఆ రెండు వేడుకులకు హాజరైన ఆయన తిరిగి శుక్రవారం రాత్రే తాడేపల్లికి వెళ్లిపోయారు. టైట్ షెడ్యూల్ వేళ.. ఆర్టీసీ సమ్మె అంశంపై చర్చల మీద చర్చలు జరుపుతున్న వేళ.. సీఎం కేసీఆర్ రావటంలో ఆలస్యమైందని.. అప్పటికే జగన్ వచ్చి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News