కేసీయార్ ప్రయాణం ఎటువైపు అర్ధం కావటంలేదు. ప్రస్తుతానికైతే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు కాబట్టి, మోడిపై యుద్ధమే అంటు ప్రకటించారు కాబట్టి ఎన్డీయేకి వ్యతిరేకమనే అనుకోవాలి. అయితే మోడి వ్యతిరేక స్టాండులో ఎంతకాలం ఉంటారనేదే అసలైన ప్రశ్న.
ఎందుకంటే కేసీయార్ స్ధిరచిత్తం లేని నేత. ఎప్పుడు ఏది అవసరమో దాని ప్రకారం ప్లేటు ఫిరాయించేస్తారు. ఈ విషయం గతంలోనే అనేకసార్లు నిరూపణైంది. హైదరాబాద్ లో కూర్చుని మోడిపై యుద్ధమంటారు. వెంటనే ఢిల్లీకి వెళ్ళి ఇదే మోడికి ఒంగి ఒంగి దండాలు పెట్టొస్తారు.
ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న పార్టీలతో ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కూడా నిలవలేరు. ఎన్నికల సమయంలో ఒక పార్టీతో పెట్టుకునే కేసీయార్ కనీసం ఫలితాలు వచ్చేవరకు కూడా ఆగకుండా వ్యతిరేక కూటమితో చేతులు కలిపేస్తారు.
అందుకనే దేశంలోని ఏ ప్రాంతీయపార్టీ అధినేత కూడా కేసీయార్ ను నమ్మటంలేదు. గతంలో కూడా మోడికి వ్యతిరేకంగా దేశంలో ప్రత్యామ్నాయ కూటమి రెడీ చేస్తానంటు చాలా మాటలే మాట్లాడారు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తో భేటీ అయ్యారు.
అయితే వాళ్ళ మధ్య భేటీలో ఏమయ్యిందో ? ఏమి చర్చించుకున్నారో తెలీదు కానీ తర్వాత పరిణామాల్లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు కేసీయార్ మద్దతు ప్రకటించారు.
ఇలాంటి భిన్న వైఖరుల వల్లే కేసీయార్ ను జాతీయ రాజకీయాల్లో ఎవరు నమ్మటంలేదు. ఈ విషయం కేసీయార్ కు కూడా బాగా తెలుసు. అయినా తానేదో అపర చాణుక్యుడననే భావనలో ఉన్న కారణంగా కేసీయార్ తన వైఖరిని మార్చుకోవటంలేదు.
తాజాగా వరి రాజకీయం కారణంగా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే ఇపుడు చెబుతున్న యుద్ధం ఎంతకాలమనేది తెలీదు. ఎందుకంటే బాయిల్డ్ రైస్ కొనకూడదనేది కేంద్రం పెట్టుకున్న పాలసీ డెసిషన్.
కాబట్టి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బాయిల్డ్ రైస్ కొనటంలేదు. అయితే కేసీయార్ మాత్రం తెలంగాణాలో బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అంటు కేంద్రంపై పదే పదే ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఒత్తిడి వర్కవుటయ్యేట్లు కనబడటంలేదు.
పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై మరింత ఒత్తిడి పెట్టాలని, పార్లమెంటులోని ఇతర పార్టీల ఎంపీలను కలుపుకుని కేంద్రంపై బాగా ఒత్తిడి తేవాలని తన ఎంపీలను ఆదేశించారు.
అయితే ఒడిస్సాలోని బీజూ జనతాదళ్ తప్ప ఇతర పార్టీల ఎంపీల సహకారం టీఆర్ఎస్ కు అందుతున్నట్లు లేదు. రా రైస్ తప్ప బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం కూడా గట్టిగానే కూర్చున్నది. మరీ పరిస్ధితుల్లో కేసీయార్ కు సహకరించే ఇతర పార్టీలేవి అనేకి ప్రశ్నగా మారింది.