తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గుర్తుందిగా! దీనిపైనే ఏపీలోను - తెలంగాణలోనూ కూడా వివాదానికి దారి తీసింది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ఉండగా.. ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు అంటూ.. కేసీఆర్‌పై అక్కడి విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. అయితే, ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన వాదన తెరమీదికి వచ్చింది. కాళేశ్వరం కారణంగా సీమ ప్రాంతాలు మరింత నష్టపోతాయని - నీరు చుక్కకూడా ఈ ప్రాంతాలకు రాదని - ఈ విషయం తెలిసి - దీనిపై ఒకప్పుడు తీవ్ర విమర్శలు చేసిన ప్రస్తుత సీఎం జగన్.. ఏకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎలా హజరువుతారని ప్రతిపక్షం టీడీపీ దుమ్మెత్తి పోసింది.
అయితే, అసలు ప్రాజెక్టు కట్టిందే మీరు అధికారంలో ఉన్న సమయంలో.. ఆ సమయంలో మీరేం చేశారు? అప్పుడు అడ్డుకోడానికి భయపడి కేసీఆర్ ను అలా వదిలేశారా? అంటూ.. అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. అయినప్పటికీ.. జరిగింది ఏదో జరిగింది కాబట్టి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడమే ఉత్తమమని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సభలో వెల్లడించారు. ఈక్రమంలోనే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వినియోగించుకునేలా అక్కడి సీఎం కేసీఆర్ చేసిన వ్యూహానికి తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని, ఈ విషయంలోఎవరు అడ్డు పడినా ముందుకే పోతామని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో కాళేశ్వరం సహా త్వరలోనే ఏపీ-తెలంగాణల సారథ్యంలో కొన్ని కొత్త ప్రాజెక్టులు తెరమీదకి రానున్నాయి.
ఇదిలావుంటే - ప్రస్తుతం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఆయన ఒడిసి పడుతున్నారనే అంటున్నా జల రంగంలోని నిపుణులు. వారు చెబుతున్న గణాంకాలను పరిశీలిస్తే.. గోదారమ్మ దారినే కేసీఆర్ శాసించేలా ఉండడం గమనార్హం. ప్రతి నీటి బొట్టును ఆయన చాలా జాగ్రత్తగా తెలంగాణ పొలాలకు మళ్లిస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ఆ లెక్కలు ఇవీ..
కాళేశ్వరం అప్ డేట్స్
మేడిగడ్డ బ్యారేజ్
ఈ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి మట్టం 16.17 టీఎంసీలు. అయితే, ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు ఉన్న అంచనాల ప్రకారం 5.647 టీఎంసీలు ఉన్నాయి. అదేసమయంలో ఎఫ్ ఆర్ ఎల్ 100 మీటర్లయితే.. తాజా అంచనాల ప్రకారం 95.7 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతానికి బ్యారేజీ గేట్లు ఓపెన్ చేయలేదు.
అన్నారం బ్యారేజీ
ఈ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి మట్టం 10.87 టీఎంసీలు. అయితే, ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు ఉన్న అంచనాల ప్రకారం 7.68 టీఎంసీలు ఉన్నాయి. అదేసమయంలో ఎఫ్ ఆర్ ఎల్ 119 మీటర్లయితే.. తాజా అంచనాల ప్రకారం 117.550 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం వరకు బ్యాక్ వాటర్ ప్రవాహం 27 కిలోమీటర్లు. సుండుపల్లి బ్యారేజీ బ్యాక్ వాటర్ ప్రవాహం 21 కిలో మీటర్లుగా ఉండడం గమనార్హం.
కన్నెపల్లి పంప్ హౌస్
ఈ ప్రాజెక్టులో మొత్తం పంపులు 6. మొత్తం కెపాసిటీ 13200 క్యూసెక్కులు. అన్నారం పంప్ హౌస్ లో మొత్తం పంపులు 3. వీటి కెపాసిటీ 9 వేల క్యూసెక్కులు.
సుందిళ్ల బ్యారేజీ
ఈ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి మట్టం 8.83 టీఎంసీలు. అయితే, ఈ నెల 25 సాయంత్రం 3 గంటలకు ఉన్న అంచనాల ప్రకారం 1.678 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అదేసమయంలో ఎఫ్ ఆర్ ఎల్ 130 మీటర్లయితే.. తాజా అంచనాల ప్రకారం 122.9 మీటర్లకు చేరుకుంది. కాశిపేట వరకు అన్నారం బ్యాక్ వాటర్ 28 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. సో.. మొత్తంగా ఎక్కడా కూడా గోదావరికి సంబంధించిన చుక్కనీరు కూడా వృథా కాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.