కీలకబాధ్యతలు స్వీకరించే సమయంలో రాగద్వేషాలకు అతీతంగా ఉంటానని.. పక్షపాతంతో వ్యవహరించనని త్రికరణ శుద్దిగా బాధ్యతలు నిర్వహిస్తానని నేతలు తమ ప్రమాణస్వీకారోత్సవ సందర్భంగా ప్రమాణం చేస్తారు. చేసే ప్రమాణాలకు.. ఆచరించే వాటికి అస్సలు సంబంధం ఉండదన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. సర్కారీ ఇస్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరి.. వీటి గురించి అధికారంలో ఉన్న నేతలకు అస్సలు పట్టదు. తాజాగా బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్నానని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడు చదువుకున్న స్కూలు పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం ఆయన చెవిన పడింది. మెదక్ జిల్లా దుబ్బాకలో కేసీఆర్ చదువుకున్న స్కూల్ బిల్డింగ్ పాడైపోయిందని.. దాన్ని బాగు చేయాలంటూ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కేసీఆర్ కు చెప్పటంతో ఆయన స్పందించారు.
వెనువెంటనే.. ఇస్కూలు అదిరిపోయేలా నిర్మించాలని.. చక్కటి ప్లాన్ గీయించాలని ఆదేశాలు జారీ చేశారు. రాజు తలుచుకుంటే ప్లాన్లకు కొదవా? ఆయన కోరుకున్నట్లే ప్లాన్ సిద్ధమైంది. స్కూల్ నిర్మాణానికి రూ.5కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. తాజాగా శంకుస్థాపన కూడా జరిగింది. అంతాబాగానే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి స్కూళ్లు చాలానే ఉన్నాయని.. వాటి సంగతి కూడా చూడాలన్న విషయం కేసీఆర్ మర్చిపోకూడదు తాను చదివిన స్కూలు ఒక్కటే ఇంద్రభవనంలా ఉంటే సరిపోదు. తెలంగాణ రాష్ట్రాధినేతగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చాల్సిన బాధ్యత ఉందన్న విషయం తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోకూడదు.