సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండేవి. ఇక నాడు ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు తొమ్మిదేళ్ళు పాలించారు. అలాగే ఢిల్లీ స్థాయిలో ఆయన చక్రం తిప్పారు. జాతీయ స్థాయి నేతలను కూడగట్టి యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. అదే విధంగా కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వం ఆరేళ్ల పాటు ఏ విధంగా ఇబ్బంది లేకుండా సాగడం వెనక చంద్రబాబు ఉన్నారు. రాజకీయాల్లో గండర గండడుగా చంద్రబాబుకు పేరు.
మరో వైపు చూస్తే పన్నెండేళ్ళ రాజకీయ జీవితం జగన్ ది. ఆయన అప్పటి ఢిల్లీ నాయకత్వాన్ని నిగ్గదీసి ధీటైన పోరాటాలు చేయడం ద్వారానే జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆయన తండ్రి వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. కేసీయార్ చంద్రబాబు నాయకత్వాన టీడీపీలో పనిచేశారు. ఇక వైఎస్సార్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి. జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే దానికి హాజరై కేసీయార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అలాంటి కేసీయార్ జాతీయ స్థాయిలో రాణించాలని అనుకుంటున్నారు. అది మంచిదే. తెలుగు వారు ఢిల్లీలో జెండా ఎగరవేస్తారూ అంటే సాటి వారు సంతోషిస్తారు. అయితే కేసీయార్ మాత్రం ఏపీని పక్కన పెట్టి మొత్తం దేశమంతా చుట్టి రావడమే ఇక్కడ చర్చగా ఉంది. కేసీయార్ పాలిస్తున్న తెలంగాణాలో గట్టిగా ఉన్నవి పదిహేడు ఎంపీ సీట్లు మాత్రమే. మరి అదే ఆంధ్రాలో అయితే పాతిక సీట్లు ఉన్నాయి.
కేసీయార్ జాతీయ స్థాయిలో పట్టు సాధించాలీ అంటే ముందుగా ఏపీని కూడా దగ్గరకు తీయాల్సిన అవసరం ఉంది. ఇది నంబర్ గేమ్. ఎవరికి ఎన్ని ఎంపీ సీట్లు ఉంటే వారికే గౌరవం ఇస్తారు. ఆ విధంగా చూసుకుంటే కేసీయార్ సాటి రాష్ట్రం ఆంధ్రాను కలుపుకోకుండా ఢిల్లీకి వెళ్ళి రచ్చ చేయడం మీదనే అంతా చర్చించుకుంటున్నారు.
చంద్రబాబు, జగన్ ఈ ఇద్దరూ కేసీయార్ కి తెలియని వారు కారు. పైగా ఇద్దరితోనూ వివిధ సందర్భాల్లో ఆయన సన్నిహితంగా మెలిగి ఉన్నారు కూడా. మరి ఢిల్లీకి వెళ్ళి కేవలం ఏడు ఎంపీ సీట్లున్న కేజ్రీవాల్ ని కేసీయార్ కలుస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఎన్సీపీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేని కలిసివచ్చారు.
బీహార్ లో విపక్షంలో ఉన్న లాలూతో, ఆయన్ కుమారుడు తేజస్వీతో మాట్లాడుతున్నారు, పొరుగున ఉన్న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కి ఒకసారి కలసి వచ్చారు. ఇలా జూనియర్లను, సీనియర్లను కలుస్తున్న కేసీయార్ జగన్ తో ఎందుకు మాట్లాడడం లేదు అన్నదే చర్చ. లోక్ సభలో 22 ఎంపీలు జగన్ కి ఉన్నారు. రాజ్యసభలో మరో ఆరుగురు ఎంపీలు కూడా ఆయనకు ఉన్నారు. పార్లమెంట్ లో నాలుగవ పెద్ద పార్టీగా వైసీపీ ఉంది.
వైసీపీ బీజేపీకి మిత్రుడు కాదు, అంశాల వారీగామద్దతు ఇస్తోంది తప్ప కేంద్ర వైఖరి విషయంలో వైసీపీ పెద్దలు కూడా ఏమంత సంతృప్తిగా లేరు అని అంటున్నారు. జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలను జగన్ కూడా పరిశీలిస్తున్నారు. బీజేపీతో మేలు జరగకపోతే మరో దారి చూసుకోవడానికి వైసీపీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ పార్టీకి బీజేపీతో ఎలాంటి స్నేహాలు అయితే లేవు కూడా.
అయినా కానీ కేసీయార్ జగన్ వైపు కన్నెత్తి చూడడంలేదు, పన్నెత్తి పలుకరించడం లేదు. ఇది నిజంగా రాజకీయ చిత్రంగానే భావిస్తున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు విషయంలోనూ కేసీయార్ అలాగె ఉన్నారు. ఆయన్ని కూడా పట్టించుకోవడంలేదు, బాబు బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారు అన్న ప్రచారం అయితే ఉన్నా ఈ రోజుకు అయితే బాబు ఒంటరిగానే ఉన్నారు. పైగా జాతీయ స్థాయిలో బాబుకు పలుకుబడి ఉంది. ఆయనకు మంచి అనుభవం ఉంది. అయినా సరే బాబుని కూడా కేసీయార్ అసలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇవన్నీ సరే కానీ ఇంట గెలిచి ఎవరైనా రచ్చ గెలుస్తారు. సాటి తెలుగు రాష్ట్రం నుంచి మద్దతు కోరకుండా వారితో సంప్రదింపులు లేకుండా హిందీ బెల్ట్ లో నిలిచి మోడీని ఢీ కొడతాను అని కేసీయార్ పడుతున్న తాపత్రయం మాత్రం అత్యాశగానే ఉందని అంటున్నారు. మరి కేసీయార్ రాజకీయాలు ఏంటో, ఆయన వ్యూహాలు ఏంటో కూడా చూడాల్సి ఉంది మరి.