అప్పటివరకూ ఉన్న పరిస్థితిని కేవలం తన నోటిమాటతో మార్చేసే సత్తా ఉన్న రాజకీయ అధినేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. తనపై అలకబూనిన వారిని తన దారికి తెచ్చుకోవాలని కేసీఆర్ కానీ ఫిక్స్ అయితే.. ఆయన నోటినుంచి వచ్చే మాటల ప్రభావంతో సీన్ మొత్తాన్నితనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. తన మీద గుర్రుగా ఉన్న వారిని బుజ్జగించటంలో ఆయనకు ఆయనే సాటి. ఒప్పందకార్మికుల ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పిన వరం తెలంగాణ సర్కారు పవర్ లోకి వచ్చిన ఇంత కాలం వరకూ చోటు చేసుకోని నేపథ్యంలో ఈ ఇష్యూపై ఉద్యోగులు కాస్తంత గుర్రుగానే ఉన్నారు.
కొందరైతే.. ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా చేయటమే కాదు.. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపటం.. తాను ఇచ్చిన హామీని నెరవేర్చుకోవటానికి మరికొంత సమయాన్ని ఒడుపుగా తీసుకోవటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే కిటుకుగా చెప్పక తప్పదు. తాజాగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.
ఇటీవల కట్టించిన సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ లో మాట్లాడిన కేసీఆర్.. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు హిట్ సినిమా ఫార్ములా ఏమిటన్నది తనదైన శైలిలో చెప్పేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్దితో పని చేయాలన్న విషయాన్ని చెబుతూ.. ‘‘చిత్తశుద్దితో సీఎం పని చేయాలి. అటెండరూ పని చేయాల్సిందే. సినిమాలో హీరో ఒక్కడే ఉండడు. అన్ని పాత్రలు ఉంటాయి. ఎవలి పాత్ర వాళ్లు పోషించినప్పుడే సినిమా హిట్టయితది. అట్లనే రాష్ట్ర ప్రగతి కోసంకిందిస్థాయి ఉద్యోగి నుంచి సీఎం వరకూ ఎవరి పాత్ర వారు పోషించాల్సిందే’’ అని చెప్పారు.
రాజకీయ పార్టీలు వస్తయి.. పోతయి అని.. అధికారం శాశ్వితం కాదని.. కానీ తెలంగాణ.. ప్రజలు శాశ్వితమని.. వారికిసేవలు అందించటం తమ ధర్మంగా చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంతో చేశామని చెప్పిన ఆయన.. ఆ విషయాల్ని ఎకరవు పెట్టటం గమనార్హం. తాము ఇన్ని ప్రోత్సాహకాల్ని ఇచ్చినప్పుడు ప్రజలు విసుక్కోకుండా పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదిగా చెప్పిన ఆయన.. పలు సందర్భాల్లో ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం కొట్లాడతారని.. అలాంటి వాటి విషయాల్లో తెగే దాకా లాగటం మంచి పని కాదన్న కేసీఆర్.. పని బందు చేసుకొని కూసుంటమంటే ఎట్ల? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచుకోవాలే కానీ.. పని బంద్ చేసుకొని పాడు చేసుకుంటామంటే ఎలా?అంటూనే.. ఒక్కసారి కాకుంటే పదిమాట్ల చర్చించుకోవాలె.. సమస్యల్ని పరిష్కరించుకోవాలంటూ ఉద్యోగులు ఏం చేయాలో.. ఏం చేయకూడదో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఏమైనా.. విషయాన్ని తనకు తగ్గట్లుగా చెప్పటంలో కేసీఆర్ మొనగాడు అనటానికి ఈ మాటలు సరిపోతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/