బాప్ రే.. కేసీఆర్ ప్లాన్ మామూలుగా లేదే..

Update: 2018-12-22 05:42 GMT
కుమారుడు కేటీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలిచ్చాక కేసీఆర్ తన ఫుల్ ఫోకస్ ఇప్పుడు జాతీయ రాజకీయాల పైనే పెట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వీలుంటే ప్రధాని పదవిని ఆశించాలని యోచిస్తున్నారట.. తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక కేసీఆర్ ఇమేజ్ జాతీయ రాజకీయాల్లో పెరిగిపోయింది. మహాకూటమి కట్టి అన్ని పార్టీలు ఏకమైనా కేసీఆర్ ను ఓడించలేకపోవడం జాతీయ నేతలను ఆకర్శించింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ కు జాతీయస్థాయిలో ఆహ్వానాలు అందుతున్నాయట. వారిని  ఒప్పించేందుకు పెద్ద పెద్ద ప్లాన్లు కేసీఆర్ వేసినట్టు సమాచారం.

చిన్న రాష్ట్రం నుంచి కొన్ని సీట్లు మాత్రమే కలిగిన కేసీఆర్ ను కొంత కాలం వరకు జాతీయ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ కేసీఆర్ పాలనా దక్షత, పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఇప్పుడు కేసీఆర్ కు ఆహ్వానాలు పలుకుతున్నారట.. అందుకే 23 నుంచి కేసీఆర్ పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ముందుగా ఒడిషా కు బయలు దేరి వెళుతున్నారు. అంతకుముందు విశాఖలో  శారదాపీఠాన్ని సందర్శించి స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లి అక్కడ సాయంత్రం ఆరుగంటలకు నవీన్ పట్నాయ్ తో సమావేశమవుతారు. అనంతరం రాత్రి ఒడిషా సీఎం కార్యాలయంలోనే ఆ రాత్రి బస చేస్తారు.. తెల్లవారి కోణార్క్, జగన్నాథ ఆలయాన్ని తెలంగాణ సీఎం సందర్శిస్తారు.

24న సాయంత్రం బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం బెంగాల్ కాళీమాత ఆలయాన్ని సందర్శిస్తారు. 25నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో కేసీఆర్ ఉంటారు. అక్కడే పలువురు నాయకులను కేసీఆర్ కలుస్తారు.  ఫెడరల్ ఫ్రంట్ పై స్పష్టత తీసుకొస్తారు.

కాగా కేసీఆర్ ఈ నెల రోజుల పర్యటనకు గాను తాజాగా ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిలోనే దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి అసదుద్దీన్ తో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించేందుకు రెండు హెలీక్యాప్లర్ల ను కూడా కేసీఆర్ బుక్ చేసుకున్నారట.. ఇలా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News