తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కొత్త వార్త ఒకటి ప్రచారం అవుతోంది తనదైన శైలిలో రాజకీయాలు నెరిపి తెలంగాణ రాష్ట్ర సాధించడమే కాకుండా మొదటి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్... త్వరలో ఆయన రిటైర్ కానున్నారట. ఈ ఏడాది డిసెంబర్‌లో సీఎం పీఠాన్ని కేసీఆర్ వదిలేసి తన కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయనున్నారట. మరి కేసీఆర్ ఏం చేయనున్నారు? అంటే ఆయన మరో కీలక బాధ్యత ఎత్తుకోనున్నారట.
తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో బలమైన పార్టీ అనే గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్,2017లో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారట. ఇందులో భాగంగా టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవమైన ఏప్రిల్ 27న కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించే పనిని కూడా ఆషామాషీగా చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరట. ఇందుకోసం ప్రత్యేకమైన వ్యూహం ఒకటి సిద్ధం చేశారని సమాచారం.
పార్టీలోని కొందరు నేతలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా కేటీఆర్ రాజకీయ లక్షణాలను, సీఎం పదవికి కావాల్సిన అర్హతలను కేసీఆర్ అంచనా వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్‌కు మంచి వక్త అనే పేరున్నప్పటికీ అది ముఖ్యమంత్రి అనే స్థాయికి సరిపడా లేదంటున్నారు. అందుకోసమే ఈ పరీక్ష. ఈ బృందం ఇచ్చే రిపోర్ట్, తన సొంత విశ్లేషణ తోడు చేసుకొని కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. ఒకవేళ ఈ ప్రక్రియలో ఎక్కడైనా సానుకూలమైన పరిస్థితి లేకపోయినా, లేదంటే కేసీఆర్ మనసు మారినా 2019 వరకు కేసీఆరే సీఎం అనేదాంట్లో ఎలాంటి సందేహం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/