నిత్యం క్షణం తీరిక లేకుండా గడిపే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం మొత్తం తన వ్యవసాయక్షేత్రంలో గడపటం తెలిసిందే. తాజాగా ఫాంహౌస్‌లో వేస్తున్న అల్లం సాగుకు సంబంధించి మొత్తం పర్యవేక్షణ దగ్గర ఉండి చూసుకున్న కేసీఆర్‌ను కలిసేందుకు టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వెళ్లటం.. ఆయనతో భేటీ కావటం పలువరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఓటుకు నోటు వ్యవహారంలో విడుదలైన వీడియో టేపులు ఒరిజినల్ అని తేలటంతో పాటు.. స్టీఫెన్‌సన్ చేసిన ఫిర్యాదుపై కోర్టులో వాదనలు మొదలైన రోజు ఆయన.. ముఖ్యమంత్రిని ఆయన ఫాంహౌస్‌లో కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టీఫెన్‌సన్‌ను వెంటబెట్టుకొని వ్యవసాయ క్షేత్రంలో తిరిగిన కేసీఆర్.. ఆయనతో ఏకాంత చర్చలు జరిపారు.
రాత్రి వరకూ ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలోనే స్టీఫెన్‌సన్ గడపటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫాంహౌస్‌లో ఉన్న ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి అంత హడావుడికి స్టీఫెన్‌సన్ ఎందుకు వెళ్లినట్లు? ఆయనతో ఏకాంత సంభాషణలు ఏమై ఉంటాయి? గంటల కొద్దీ ఫాంహౌస్‌లోనే ఆయన ఎందుకు గడిపినట్లు? లాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓటుక నోటు కేసుకు సంబంధించి అప్‌డేట్స్‌తో పాటు.. తదుపరి వ్యూహం మీద చర్చించేందుకే స్టీఫెన్‌సన్‌ను తన ఫాంహౌస్‌కు కేసీఆర్ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.