తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి చాలానే అంచనాలు వెలువడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే విషయంలో క్లియరెన్స్ కోసమే గవర్నర్‌తో భేటీ అన్న మాట బలంగా వినిపిస్తోంది.
అయితే.. విశ్వసనీయ వర్గాల వాదన మాత్రం మరోలా ఉంది. గవర్నర్ తో కేసీఆర్ భేటీ.. ప్రధానమంత్రి మూడ్ తెలుసుకోవటానికే అన్న మాట వినిపిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాని ఎలా స్పందించారు. ఆయన నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తెలుసుకోవటం కోసమే తాజా భేటీ అని చెబుతున్నారు.
చంద్రబాబుకు నోటీసుల వ్యవహారం మొత్తం ఏసీబీ ఇచ్చే ఆలోచన తెలంగాణ సర్కారుకు లేదని చెబుతున్నారు. ఒకవేళ అలాంటిది జరిగితే ఈ వ్యవహారం తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాల మధ్య పోరాటమన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని.. అది జరిగితే తమపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. గవర్నర్‌తో తాజా భేటీ ఢిల్లీ పరిణామాలకు సంబంధించిన ఫీడబ్యాక్ కోసమేనని చెబుతున్నారు.