తెలంగాణ ముఖ్యమంత్రి మరో వర్గాన్ని ఫిదా చేసేశారు. రైతులు - ఉద్యోగులు - ఉపాధ్యాయులు - పండితులు - కవులు కళకారులు రూపంలో ఇప్పటికే పలు వర్గాలను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రవాసీయులపై దృష్టి సారించారు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఎన్నారైలకు ఊహించని తీపికబురు అందించారు. విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ వాసులను ప్రభుత్వం ఖర్చులతో రాష్ర్టానికి రప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఐదు రోజుల పాటు స్టార్ హోటల్లలో వసతి కల్పించారు. అట్టహాసంగా సాగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వారికి సాక్షిభూతంగా నిలిపారు.
ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఊహించని విందు ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిథులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవాస తెలంగాణ వారికి పిలుపునిచ్చారు.
అయితే ఎన్నారైలకు కేసీఆర్ ఆశ్చర్యకరమైన ఆఫర్లు ఇక్కడితోనే అయిపోలేదు. తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి వచ్చిన 450 మంది ఎన్ ఆర్ ఐలకు తెలంగాణ టూర్ కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథకాలు - ప్రాజెక్టులు అయిన మిషన్ భగీరథ - కాళేశ్వరం - డబుల్ బెడ్ రూంలు పరిశీలించేందుకు టూర్ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ సూచనతో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలనకు ఎన్ ఆర్ ఐలు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మొదటిరోజైన బుదవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో వాటర్ గ్రిడ్ - ఎడ్యుకేషనల్ హబ్ - డబుల్ బెడ్ రూం పనులను ఎన్ ఆర్ ఐలు పరిశీలించనున్నారు. గజ్వేలు తర్వాత సిద్ధిపేటలో డబుల్ బెడ్ రూం - ఇతర అభివృద్ధి పనులు పరిశీలించి రాత్రికి ఎన్నారైలు హైదరాబాద్ చేరుకోనున్నారు. రెండో రోజైన గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు ఎన్ ఆర్ ఐలు వెళ్లనున్నారు.
ఇదిలాఉండగా... ఎన్నారైలతో సమావేశం సందర్భంగా అభివృద్ధిలో ఎన్ ఆర్ ఐలు భాగస్వాములవ్వాలని పిలుపు నిచ్చిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పలు అంశాలను వారికి వివరించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని, తెలంగాణ ప్రవాసులు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను - సంక్షేమ కార్యక్రమాలను - భాషా సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వారికి వివరించారు.