ఏ పని చేసినా అందులో తన మార్క్ ఉండాలని అనుకుంటారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆయనకు మార్కుతో పాటు ముహూర్తాలు కూడా కావాలి. మంచి ముహూర్తం లేకపోతే.. ఇంట్లోంచి అడుగు కూడా బయటకు పెట్టరు. ప్రభుత్వ రద్దు, అభ్యర్థుల ప్రకటన, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం, యజ్ఞాల యాగాలు.. ఇలా కేసీఆర్ చేసిన ప్రతీ పనికి ముహూర్తం నిర్ణయించుకునే చేశారు. అలాంటిది మంత్రి వర్గ ఏర్పాటుకు కూడా మంచి ముహూర్తాన్ని డిసైడ్ చేసుకున్నారు కేసీఆర్.
ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి 3 ముహూర్తాల్ని ఫైనల్ చేశారు. 3- 5- 10 తేదీలు బాగున్నాయని ఇప్పటికే పండితులు చెప్పారు. ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోమని సూచించారు. దీంతో.. తన పేరు బలం ప్రకారం.. ఏ అంకె, ఏ రోజు బావుంటుందో చూసుకుని.. ఆ రోజు మంత్రివర్గ విస్తరణ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కూడా ఫిక్స్ అవడంతో.. ఆశావహులు స్పీడ్ పెంచారు. ప్రతీరోజూ కనీసం 10 మంది ఎమ్మెల్యలకు తగ్గకుండా కేసీఆర్‌ని కలుస్తున్నారు. ఈసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అయితే.. మంత్రివర్గంలోకి ఎవరెవర్ని తీసుకోవాలో ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందట. దానికి తగ్గట్లుగానే విస్తరణ ఉంటుందని.. విస్తరణలో మంత్రి పదవి దక్కనివారికి పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడాలని కేసీఆర్ సూచించబోతున్నట్లు సమాచారం.