కేసీఆర్ సాబ్‌...అస‌లు విష‌యం ఆలోచించారా?

Update: 2019-10-29 14:30 GMT
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో నియోజ‌క‌వ‌ర్గం చ‌రిత్ర‌లో లేని రికార్డు మెజార్టీతో...కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ఓడించి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. దీంతో, తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌...ఫుల్ జోష్‌ లో ఉన్నారంటున్నారు. కారు జోరు కొన‌సాగుతోంద‌ని...ప్ర‌జ‌లు త‌మ విధాన‌మే రైట్ అని ఓటు వేశార‌ని కేసీఆర్ విశ్లేషించారు. అయితే, క‌లిసి వ‌చ్చిన స‌మ‌యం కంటే..రాబోయే కాలం గురించి గులాబీ ద‌ళ‌ప‌తి ఆలోచించాల‌ని ప‌లువురు అంటున్నారు. ముందున్న మున్సిప‌ల్ ఎన్నిక‌లు - ఆ త‌ర్వాతి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు గులాబీ పార్టీకి లిట్మ‌స్ టెస్ట్ వంటి వ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్ర నినాదంతో తెర‌మీద‌కు వ‌చ్చిన టీఆర్ ఎస్ పార్టీకి...సొంత రాష్ట్రం ఏర్పాటైన కాలం క‌లిసి వ‌చ్చింద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.  2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ - 11 లోక్‌ సభ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేప‌ట్టింది. ఆ తర్వాత జరిగిన మెదక్ - వరంగల్‌ లోక్‌ సభ - నారాయణ్‌ ఖేడ్ - పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్‌ గెలుపు దారిలోనే సాగింది. 2018 ముందస్తు ఎన్నికల్లో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారం తిరిగి సొంతం చేసుకుంది. అనంతరం జరిగిన సర్పంచ్‌ లు - ఎంపీటీసీలు - జడ్పీటీసీ ఎన్నికల్లో 60% పైగా స్థానాలు - దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా ఏకంగా 32 జడ్పీ పీఠాలు కైవసం చేసుకుంది. ఆ దూకుడు కొన‌సాగిస్తూ...తాజాగా హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో 50 శాతానికి పైగా ఓట్లతో రికార్డు విజయం ద‌క్కించుకుంది.

పట్టణ ప్రాంతాల్లో టీఆర్ ఎస్‌ కు కళ్లెం వేయడం ప్రతిపక్ష పార్టీలకు తక్షణ కర్తవ్యంగా మారింద‌నేది సుస్ప‌ష్టం. ఎందుకంటే...ఆ పార్టీ బ‌లంగా ఉన్న ఉత్త‌ర తెలంగాణ‌లోని నిజామాబాద్‌ - క‌రీంన‌గ‌ర్‌ ల‌లో ఎంపీలుగా బీజేపీ నేత‌లు ఉన్నారు. దీంతోపాటుగా - ఎమ్మెల్సీగా సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి గెలుపొందారు. మ‌రోవైపు హైద‌రాబాద్ ఎంపీగా బీజేపీ సీనియ‌ర్ నేత కిష‌న్‌ రెడ్డి - మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి గెలుపొందారు. ప‌ట్ట‌ణ‌ప్రాంతాల్లోని విద్యావంతుల‌ - ఉద్యోగులు టీఆర్ ఎస్‌ కు అండ‌గా ఉండ‌ర‌నే అభిప్రాయం...రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో..మునుప‌టి గెలుపు సంబరాల కంటే....రాబోయే మున్సిప‌ల్స్‌ - గ్రేట‌ర్ ఎన్నిక‌లు టీఆర్ ఎస్‌ కు అస‌లు ప‌రీక్ష అని ప‌లువురు పేర్కొంటున్నారు.



Tags:    

Similar News