తార‌క్ ప్ర‌స్తావ‌న వ‌స్తేనే కేసీఆర్ సంత‌కం పెడ‌తారా?

Update: 2018-08-02 09:59 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు చంద్రుళ్లు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి.. ఆ నోటా.. ఈ నోటా వినిపించే కొన్ని ముచ్చ‌ట్లు అస్స‌లు బ‌య‌ట‌కే రావ‌ట్లేదు. అధికారిక వ‌ర్గాల్లో వినిపించే గుస‌గుస‌లు కొంద‌రి చెవులకే ప‌రిమిత‌మ‌వుతున్నాయే త‌ప్పించి.. వాటి మీద చ‌ర్చ మీడియాలో కానీ.. బ‌య‌ట కానీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి.

ఏది ప‌బ్లిష్ చేయాల‌న్న స‌వాల‌చ్చ సందేహాల‌తోనే గ‌డిచిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది.ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సంబంధించిన ఒక అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప‌ద‌వీ కాలం మ‌రో ఆరేడు నెల‌ల్లో ముగియ‌నున్న‌ది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి మ‌రో మూడు నెల‌ల్లో మొద‌లు కానుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. ఫైళ్ల క్లియ‌రెన్స్ లో కేసీఆర్ కు పెద్ద‌గా ప‌ట్ట‌టం లేద‌ని చెబుతున్నారు. ఆయ‌న మ‌న‌సులో ఉన్న వాటి మీద త‌ప్పించి మిగిలిన వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న మాట ఉంది.

ఎప్పుడు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో ఉంటారో.. మ‌రెప్పుడె ఫాంహౌస్ కు వెళ‌తారో ఎవ‌రికి అర్థం కాద‌ని చెబుతారు. సెక్ర‌టేరియ‌ట్ కు అస‌లే రావ‌టం మానేసి కేసీఆర్‌.. ఫైళ్ల క్లియ‌రెన్స్ విష‌యంలోనూ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌ని చెబుతారు. ఈ కార‌ణంగా పెద్ద ఎత్తున ఫైళ్లు క్లియ‌ర్ కాకుండా ఉన్న‌ట్లు ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కొన్ని ముఖ్య‌మైన ఫైళ్ల‌ను చూసే స‌మ‌యంలో కేసీఆర్ నోటి నుంచి రామ్‌ కు తెలుసా? అన్న ప్ర‌శ్న‌ను వేస్తార‌ని.. తెలుస‌ని.. సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం వస్తే ఓకే కానీ.. లేదంటే మాత్రం ఫైల్ పెండింగ్ లో ఉంటుంద‌ని చెబుతున్నారు. ఫైల్ ను తాను క్షుణ్ణంగా తెలుసుకున్నా.. రామ్‌ కు తెలుసంటే అదో ధీమాగా క్లియ‌ర్ చేసే ల‌క్ష‌ణం కేసీఆర్ లో ఎక్కువ‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ వాద‌న‌లో నిజ‌మెంతన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.



Tags:    

Similar News