తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ ఎస్ ఫ్యాన్స్ ఆయన కొత్త చిత్రాన్ని తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ ప్రత్యేకత అంటే కేసీఆర్ కళ్లద్దాలు ధరించడం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వాటితో సభకు హాజరవడం! అవును. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంటి ఆపరేషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కొద్దికాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రికి ఢిల్లీలో శస్త్రచికిత్స జరిగింది.
గత ఏడాది ఈ చికిత్స జరిగినప్పటికీ కేసీఆర్ కళ్లద్దాలు ధరించి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మొదటిసారి ఈరోజు ఆయన సభకు విచ్చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కళ్లద్దాలు ధరించిన ప్రసంగ ప్రతులను తదేక దీక్షతో చూస్తున్న చిత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. దీంతో కొత్త లుక్ లో గులాబీ బాస్ అంటూ టీఆర్ ఎస్ వర్గాలు ఈ చిత్రాలను వైరల్ చేస్తున్నారు.
కాగా, సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణుడు - పద్మశ్రీ అవార్డు గ్రహీత సెంటర్ ఫర్ సైట్ (సీఎఫ్ ఎస్) చైర్మన్ డాక్టర్ మహిపాల్ ఎస్ సచ్ దేవ్ ఢిల్లీలో కేసీఆర్ కు ఆపరేషన్ ను నిర్వహించారు. ఆ సమయంలో మంత్రులు కే తారకరామారావు - హరీశ్ రావు, - ఎంపీ కవిత - ఇతర కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. చికిత్స అనంతరం డాక్టర్ సచ్ దేవ్ మాట్లాడుతూ ``సీఎం కేసీఆర్ ను పరిశీలించి ఆయనకు ఆపరేషన్ చేశాం. ఆపరేషన్ తర్వాత ఆయన ఏ విధంగా చూడగలుగుతున్నారనే విషయాలను పరీక్షించాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.`` అని తెలిపారు.