కేసీఆర్ కొత్త పార్టీ ‘నయా భారత్’?

Update: 2020-09-07 03:45 GMT
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఇప్పుడు ఆ దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు. తెలంగాణలో నిరూపించుకున్న కేసీఆర్.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ దిగిపోయినా.. బీజేపీ ఎక్కినా దేశప్రజల తలరాత మారలేదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణను సాధించి పట్టాలెక్కించిన కేసీఆర్ ఇప్పుడు నవ భారతానికి దిక్సూచి కావాలని అనుకుంటున్నారట.. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ పెట్టి దేశాన్ని ఏలే దిశగా కేసీఆర్ యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పేరు ఇప్పటికే ఖరారైందని.. చురుగ్గా రిజిస్టర్ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.

ఇక బీజేపీ దేశంలో అమెరికా తరహాలో ‘అధ్యక్ష రాజకీయాలను’ తీసుకురావడానికి రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి రెడీ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జమిలి ఎన్నికల తర్వాత అధ్యక్ష పాలనకు కమలం పార్టీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. అదే జరిగితే దేశంలో జాతీయ పార్టీలే మిగులుతాయి. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుంది. అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం అవుతాయని భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయంగా కేసీఆర్ ‘జాతీయ’ పార్టీకి పురుడు పోస్తున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలతో దేశం బాగుపడలేదని.. ప్రాంతీయ పార్టీలతో కొత్త పార్టీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.  పార్టీపై న్యాయకోవిదులు, నిపుణులతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ఎల్పీలోనూ దీనిపై చర్చ జరగబోతోందని సమాచారం. ఈ క్రమంలోనే తీర్మానం చేస్తారని అంటున్నారు.

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్ర పగ్గాలు.. సీఎం పీఠం కేసీఆర్ కు వెళుతుందని అంటున్నారు. మరి కేసీఆర్ తెలంగాణను ఏలినట్టే.. దేశాన్ని దున్నేస్తారా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News