జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త తరహా నిర్ణయాలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత మళ్లీ వెనక్కి చూసుకోకుండా.. మోడీ అండ్ కో ను ఒక చేత్తో.. కాంగ్రెస్ ను మరో చేత్తో ఆడేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తనను విమర్శించేందుకు అవకాశం ఉన్న అంశాల విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.
తాను పెట్టే జాతీయ పార్టీకి సంబంధించిన దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పార్టీ వ్యవహారాలు చూసేందుకు వీలుగా ఆయన కొందరిని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్ లాంటి నేతల్నితయారు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన ఆ పదవి నుంచి పక్కకు తప్పుకుంటారని చెబుతున్నారు.
జాతీయపార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించే వేళ.. రాష్ట్రపార్టీ పదవిని కుటుంబ సభ్యులకు అప్పజెబితే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంటుందని.. అందుకే ఆ పదవిని తనకు నమ్మకస్తుడైన వ్యక్తికి అప్పజెప్పాలన్నది కేసీఆర్ ప్లానింగ్ గా చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు అప్పజెప్పటం ద్వారా.. గుర్రుగా ఉన్న ఆ వర్గానికి పెద్దపీట వేసినట్లు అవుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఎప్పటిలానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి కేటీఆర్ కంటిన్యూ అవుతారని.. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టే క్రమంలో.. రాష్ట్ర పార్టీ పగ్గాలు బయట వారికి ఇవ్వటం ద్వారా.. అందరికి సమాన అవకాశాలు తమ పార్టీలో ఉంటాయన్న సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
జాతీయ పార్టీకి కొందరిని తీసుకెళ్లటం ద్వారా.. రాష్ట్రపార్టీలో కొత్త వారికి పదవులు అప్పజెప్పటం ద్వారా.. కినుకుగా ఉన్న నేతల్ని ఊరట చెందేలా చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.