రాష్ట్ర అవార్డుల ఫంక్షన్‌ కు కేసీఆర్ రాలేదేం?

Update: 2018-06-03 04:36 GMT
విల‌క్ష‌ణ‌మైన తీరుతో ఎవ‌రికి అర్థం కాన‌ట్లు వ్య‌వ‌హ‌రించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంద‌ని చెప్పాలి. ముఖ్య‌మంత్రిగా నాలుగేళ్ల త‌న ప‌ద‌వీ కాలంలో ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు వ‌రుస‌గా సెక్ర‌టేరియ‌ట్‌ కు రాని ఘ‌న‌త ఆయ‌న సొంత‌మ‌ని చెప్పాలి. సెక్ర‌టేరియ‌ట్ వాస్తులో ఏదో తేడా ఉంద‌ని ఫీల‌య్యే ఆయ‌న‌.. అటువైపు ముఖం చూపించ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హైద‌రాబాద్‌ లో ఉండాల్సిన ముఖ్య‌మంత్రి త‌ర‌చూ ఫాంహౌస్‌ కు వెళ్ల‌టంలోనూ ఆయ‌న చిత్ర‌మైన ధోర‌ణే. ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి.. రాష్ట్ర రాజ‌ధానిలో ఉండ‌టం క‌నిపిస్తుంది. ఇందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం త‌ర‌చూ ఫాంహౌస్ కు వెళ్లి రోజుల త‌ర‌బ‌డి అక్క‌డే గ‌డ‌ప‌టం ఆయ‌న‌లో క‌నిపించే మ‌రో కోణం.

అయితే.. అంద‌రి త‌ప్పుల్ని ఎత్తి చూపే కేసీఆర్ కు భిన్నంగా మీడియా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విమ‌ర్శ ఉంది. ఇలాంటి వైఖ‌రే మ‌రే ముఖ్య‌మంత్రి ప్ర‌ద‌ర్శించినా.. ఇప్ప‌టికి ఎంత డ్యామేజ్ జ‌ర‌గాలో అంత జ‌రిగేద‌ని.. కానీ.. కేసీఆర్ విష‌యంలో మీడియా ఆచితూచి అన్నట్లు వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌న స‌హ‌జ ధోర‌ణికి భిన్నంగా ఉంటుందన్న మాట అంత‌కంత‌కూ పెరుగుతోంది.

మీడియా సంస్థ‌ల‌కు అతీతంగా.. అన్ని మీడియా సంస్థ‌లు (ఇంగ్లిషు మీడియాను మిన‌హాయించాలి) కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నాయి. నిజంగానే అలాంటి ప‌రిస్థితి ఉందా?  అంటే లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మొన్న‌టికి మొన్న రెండు మూడు రోజుల‌కు పైనే ఫాంహౌస్ లో ఉండి వ‌చ్చిన కేసీఆర్‌.. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్ని నిర్వ‌హించారో లేదో.. సాయంత్రానికి మ‌ళ్లీ ఎర్రవ‌ల్లికి రిట‌ర్న్ అయ్యారు.

నిజానికి తెలంగాణ ఆవ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ర‌వీంద్ర భార‌తిలో అవార్డుల ప్ర‌ధానోత్స‌వాన్ని నిర్వ‌హించారు. దీనికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రు కావాల్సి ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని  వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు  ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే అవార్డుల కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి హాజ‌రు కావ‌టానికి మించిన మ‌ర్యాద‌.. గౌర‌వం ఏం ఉంటుంది?

తాము క‌ల‌లు క‌న్న రాష్ట్రంలో.. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల కృషికి కానుక‌గా ప్ర‌భుత్వం ఇస్తున్న అవార్డుల్ని ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా అందుకుంటే.. అవార్డు గ్ర‌హీత‌ల ఆనందం మ‌రోలా ఉంటుంది. ఇలాంటి విష‌యాల్ని కేసీఆర్ ఎందుకు గుర్తించ‌రో ఏమో కానీ.. తమ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. మ‌రి.. ముఖ్య‌మంత్రి ఎక్క‌డ ఉన్నారంటే.. ఫాంహౌస్ కు వెళ్లే దారిలో ఉన్న‌ట్లు చెప్పుకోవ‌టం అవార్డుల కార్య‌క్ర‌మంలో వినిపించింది.

వేరే కార‌ణాల‌తో బిజీగా ఉండి ముఖ్య‌మంత్రి అవార్డుల కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు అయి ఉంటే పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ.. ఫాంహౌస్ కు వెళ్లే కార‌ణంగా.. అవార్డుల ఫంక్ష‌న్ కు హాజ‌రు కాక‌పోవ‌టాన్ని అవార్డు గ్ర‌హీత‌లు అవ‌మానంగా ఫీల్ కావ‌టం క‌నిపించింది. అవార్డులు అందుకున్న ఆనందం ఆవిర‌య్యేలా చేసిన కేసీఆర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్ట‌టం క‌నిపించింది. మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి వేలాది కోట్ల రూపాయిల్ని ప‌థ‌కాల పేరుతో ఖ‌ర్చు చేసే కేసీఆర్‌.. తాను స్వ‌యంగా అవార్డులు ఇవ్వ‌టంతో ఎన‌లేని ఆనందాన్ని తెలంగాణ‌కు చెందిన వివిధ రంగాల ప్ర‌ముఖుల‌కు క‌లిగే ఫీలింగ్‌ను ఎందుకు మిస్ చేసిన‌ట్లు?
Tags:    

Similar News