మాతృభాషను మించింది లేదు. అమ్మ భాషలో ఉండే కమ్మదనం మరే భాషలో ఉండదు. ఎంత ఎత్తు ఎదిగినా.. ఎన్ని భాషలు వచ్చినా.. మాతృభాషలో మాట్లాడితే ఉండే హాయి మరెక్కడా లభించదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రేమికుడిగా.. తెలుగును భారీగా ప్రమోట్ చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు సరికొత్త కోణంలో తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని.. మాతృభాషలో బోధన తప్పనిసరి అంటూ కీలక నిర్ణయం తీసుకొని.. తెలుగు నేర్చుకోవటానికి ఇష్టపడని వారు సైతం తప్పనిసరిగా తెలుగును పాఠశాలల్లో నేర్చుకోవాలన్న రూల్ తెచ్చిన పెద్ద మనిషి.. తనకు తానుగా చేసిన ఒక పని గురించి చెప్పుకొచ్చారు.
బాహుబలి లాంటి సినిమాను ఏ తెలుగోడైనా తెలుగులో చూడాలని తపిస్తాడు. ఒరిజినల్ మూవీ తెలుగు అయినప్పడు తెలుగులో చూసేందుకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ.. తెలుగు లవ్వరగా చెప్పే సీఎం కేసీఆర్ మాత్రం బాహుబలి సినిమాను మొదట హిందీలో చూశారట. ఆతర్వాత మాత్రమే తెలుగులో చూశారట.
కేసీఆర్ లాంటి మాతృభాషాభిమాని బాహుబలి లాంటి సినిమాను తెలుగులో కాకుండా మొదట హిందీలో చూడటం ఏమిటి? ఈ విషయం ఎవరి నోటి నుంచైనా వస్తే నిజమో? కాదో అన్న సందేహం కలుగుతుంది. కానీ.. తనకు తానే ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అవాక్కు కావటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. వీర మాతృభాషాభిమాని సైతం అన్య భాషలో తెలుగు సినిమాను చూడటం ఏమిటో?