తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త నినాదాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ప్లీనరీ వేదికగా ఆయన ఆసక్తికరమైన నినాదాన్ని ఉద్ఘాటించారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తూనే మరోవైపు స్థానికంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సీమాంధ్రులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ లో ఉన్న తెలంగాణేతరులపై దాడులు జరుగుతాయని ఇంకోటని భయకంపితులను చేశౄరని పేర్కొంటూ...అలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదన్నారు. ఇదే రీతిలో భవిష్యత్ లో కూడా సీమాంధ్రుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న పౌరులంతా తెలంగాణ బిడ్డలేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వారి బాధ్యత తమదేనని ఆయన వివరించారు.
ఇక జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ దేశ రాజకీయాల్లో ప్రభావశీల - క్రియాశీల పాత్ర పోషిస్తామని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఏడు దశాబ్దాలు గడిచిపోయాయని - ఇక ఎదురు చూడదలచుకోలేదన్నారు. బీజేపీ - కాంగ్రెస్ నిష్క్రియాపరత్వమే దేశానికి శాపమని సీఎం అన్నారు. దేశాన్ని మార్చేందుకు తెంగాణ నుంచే కీలక అడుగులు పడాలని ఇందుకు తెలంగాణ గడ్డ మార్గదర్శకం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు. 'రాష్ర్టాలను - రాష్ట్ర పరిపాలనను మునిసిపాటి కన్నా హీనంగా తయారు చేసినరు మీ పరిపాలనలో. సెంటర్ లిస్టు - స్టేట్ లిస్టు - కాంకరెంట్ లిస్టు అని చెప్పినారు. ఎందుకండీ ఉమ్మడి జాబితా?మోసం చేయడానికా?. మీ పెత్తనం కొనసాగడానికా?.వ్యవసాయశాఖ మీ దగ్గరెందుకండీ . విద్యాశాఖ మీదగ్గరెందుకండీ. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన శాఖ మీదగ్గరెందుకు. ఉపాధిహామీ కూలీలకు డబ్బులు ఢిల్లీలోని పోస్టులో వేస్తరా?. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటూ ఊరూరు తిరిగి ప్రధాని రోడ్లేస్తడట.. ఇది అవసరమా? రోడ్లేసుకోవడానికి ఊర్లో సర్పంచు లేడా? - ఎంపీటీసీ లేడా - జడ్పీ ఛైర్మన్ లేరా - ఎమ్మెల్యే లేరా - రాష్ట్రప్రభుత్వం లేదా' అంటూ రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం గురించి నిలదీశారు.
తెలంగాణలో దివాలా తీసింది ఒక్క కాంగ్రెస్ పార్టీ - ఇన్వెర్టర్ కంపెనీల వాళ్లని కేసీఆర్ ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఉండే ఆటో స్టార్టర్లను తీసివేయాలని, దీంతో భూగర్భజలాల్లో నీరు అందకపోవడంతో మోటార్లు కాలిపోతాయని చెప్పారు. ఇంటింటి నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని, ఈ కార్యక్రమంలో నేతలు బిజీగా ఉన్నారన్న కేసీఆర్..మిషన్ భగీరథ ప్రపంచంలోనే హైలైట్ గా నిలుస్తుందన్నారు. ఎండాకాలం వచ్చిందంటే నీళ్లనొల్లి కనిపించేదని - తాగునీటి సమస్యలు ఎక్కడా తలెత్తకుండా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. మంచినీళ్లు - కరెంటు - హస్పిటల్ - రిజిస్ట్రేషన్ తో ముందుకెళ్తున్నామన్నారు. మత్స్యకారులకు చేపలు అమ్ముకోవడానికి వెహికిల్స్ ఇస్తున్నామని, తెలంగాణలో మత్య్సకారులను బాగుచేయవచ్చే ప్లాన్ చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయతో అన్ని చెరువులు అభివృద్ధి చేస్తున్నామని - వర్షాలతో చెరువులు నిండి పంటలు బాగా పండుతాయన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న ప్రశాంతంగా తెలంగాణ ఎప్పుడూ లేదన్నారు. ప్లీనరీ కోసం టీఆర్ ఎస్ నేతలు అద్భుతంగా ఏర్పాట్లు చేశారన్నారు.