2015లో మాదిరే ఇప్పుడూ కేసీఆర్ చేస్తారా?

Update: 2019-01-25 17:30 GMT
కొంత‌మందికి కొన్ని న‌మ్మ‌కాలు ఉంటాయి. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి న‌మ్మ‌కాలున్న నేత‌ను చూడ‌లేద‌నే చెప్పాలి. గ‌తంలో ఇదే త‌ర‌హాలో ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి ఇంత స్థాయిలో న‌మ్మ‌కాల‌కు ప్రాధాన్య‌త ఇస్తే.. మీడియాలో ఎట‌కారం మ‌రో స్థాయిలో ఉండేది. మారిన ప‌రిస్థితుల దృష్ట్యా.. ఇప్పుడు ఏ మీడియా సంస్థ కూడా కేసీఆర్ న‌మ్మ‌కాల మీద వ్యంగ్య‌స్త్రాల్ని సంధించ‌టం లేదు.

ఎలాంటి విమ‌ర్శ‌నైనా.. తెలంగాన సెంటిమెంట్ అస్త్రంతో ఎదుర్కొనే కేసీఆర్ బ్యాచ్ ను కెలుక్కునే క‌న్నా..కామ్ గా ఉంటే మంచిద‌న్న భావ‌న మీడియాలో వ‌చ్చేసింద‌ని చెప్పాలి. ఈ కార‌ణంతోనే ఎర్ర‌వెల్లిలో చేస్తున్న యాగాన్ని ఒక పూజా కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేస్తారో.. అలానే చేస్తున్నారో త‌ప్పించి.. ఒక్క మాట అంటే ఒక్క మాట‌ను అద‌నంగా రాస్తున్న‌ది లేదు.

ఈ సంగ‌తి ఇలా ఉంటే.. యాగం పూర్తి అయితే.. త‌మ యోగం మారుతుంద‌న్న భావ‌న‌లో ప‌లువురు టీఆర్ ఎస్ నేత‌లు ఉన్నారు. ఎందుకంటే.. వారు పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాదాపు ఏడాది త‌ర్వాత ఎర్ర‌వ‌ల్లిలో భారీ ఎత్తున యాగం చేయ‌టం తెలిసిందే. వేడుక‌లా జ‌రిగిన ఆ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌టంతో పాటు.. ప‌లువురికి శాఖ‌లు మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

2015లో జ‌రిగిన ఈ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్న ప‌లువురు గులాబీ నేత‌లు.. తాజాగా జ‌రుగుతున్న మ‌హా చండీ యాగం త‌ర్వాత మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

నాలుగు రోజ‌లుగా సాగుతున్న స‌హ‌స్త్ర మ‌హా చండీయాగం ఈ రోజు (శుక్ర‌వారం)తో ముగియ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత‌.. త‌మ‌కు ప‌ద‌వుల పండ‌గ ప‌క్కా అన్న మాట‌ కొంద‌రు నేత‌ల నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. దీనికి కౌంట‌ర్  వాద‌న‌ను వినిపించే వారు లేక‌పోలేదు.యాగంతోపాటు పంచాయితీఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని.. అది పూర్తి అయ్యేస‌రికి లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయ‌ని.. ఆ ఎన్నిక‌ల త‌ర్వాతే మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తార‌ని న‌మ్మ‌కంగా చెబుతున్న వారు లేక‌పోలేదు.

చూస్తూ.. చూస్తూ అన్నేసి రోజులు మంత్రివ‌ర్గం లేకుండా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని లాగుతారా? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేసినా.. ఏం చేసినా కేసీఆర్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు బాస్ అన్న‌ట్లుగా ఆయ‌న ఆలోచ‌న‌లు ఉంటాయ‌ని.. అందుకే ఆయ‌నేం చేస్తార‌న్న‌ది ఊహించ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌ను కొంద‌రు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News