గులాబీ దళపతి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు కాకుండా పార్లమెంటు ఎన్నికల తర్వాతే నామినే టెడ్ పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. మంత్రివర్గ ఏర్పాటు, పంచాయతీ ఎలక్షన్లు - పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఆయన ఇతర విషయాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశముందని తెలుస్తోంది. పార్ల మెంటు ఎన్నికల ముందు పదవుల గురించి ఆలోచించటం - కొంతమందికి ఇవ్వటం - అవిరాని వారు అసంతృప్తికి గురికావటం తదితరాంశాలు పార్టీని ఇబ్బందుల్లో పడేస్తాయని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవులు రాని వారితో తలనొప్పులు రాకుండా చూసేందుకే నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేశారని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా అందరికీ అవకాశాలు కల్పిస్తామంటూ కేసీఆర్ హామీనిచ్చారు. అందువల్ల పార్టీని గెలిపించేందుకు వీలుగా నేతలు కష్ట పడి పనిచేయాలంటూ ఆయన సూచించారు. దీంతో టీఆర్ ఎస్ గెలుపు కోసం అన్ని స్థాయిల్లోని నేతలు తమ శక్తి మేర కృషి చేశారు. ఎన్నికల తర్వాత తమకు పదవులు కచ్చితంగా వస్తాయని వారు భావించారు. కానీ ఇప్పుడు వారి అంచనాలు తారుమారయ్యాయి. పంచాయతీ - పార్లమెంటు ఎన్నికల వేళ పదవులు రాని వారు పార్టీ ఓటమికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కోణం లోంచి ఆలోచించిన ఆయన నామినేటేడ్ పదవులతో కొందరిలో సంతృప్తి - మరికొందరిలో అసంతృప్తిని రాజేయటం కంటే ఏకంగా వాటిని వాయిదా వేయడమే మంచిదని భావించారు. తద్వారా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందరితోనూ పనిచేయించుకో వచ్చని ఆయన భావిస్తున్నారు. అందుకే నియమకాలను ఇప్పట్లో చేపట్టొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ముందు ముఖ్యమైన అనేక పనులను చక్కదిద్దాలని ఆయన భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన సీఎం.. ప్రస్తుతం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. అందుకే అత్యంత కీలకమైన మంత్రివర్గ ఏర్పాటును సైతం వాయిదా వేస్తూ వస్తున్నారు. తనతోపాటు హోం మంత్రిగా మహమూద్ అలీని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 16 మందిని మంత్రులుగా నియమించాల్సి ఉన్నా దాని ఊసెత్తటం లేదు. అమాత్యులు లేకుండానే వివిధ అంశాలపై ఉన్నతాధికారులు - శాఖాధిపతులతో సమీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం.
మరోవైపు ఈనెలాఖరు నాటికి ఆరుగురు నుంచి ఎనిమిది మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని కూడా జనవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు తెలిసింది. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈనేపథ్యంలో కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పంచాయతీపైన్నే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని యోచిస్తున్నారు. అవి ముగిసిన వెంటనే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ (ఫిబ్రవరి లో) వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూ రుతున్న కేసీఆర్ లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు (దాదాపు మే వరకు) తన పూర్తి సమయాన్ని కేంద్ర రాజకీయాలకే కేటాయించనున్నా రు. అప్పటి వరకూ నామినేటెడ్ పోస్టుల గురించి మాట్లాడ వద్దంటూ ఆయన పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం. ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాతే ఈ విషయం గురించి మాట్లాడదామంటూ వారికి చెప్పినట్టు తెలిసింది. అప్పుడు కూడా పార్టీకి ఎవరెవరు ఎలాంటి సేవలందించారు..? వారి సామాజిక వర్గం ఏంటి..? అనే అంశాలను ఆయన బేరీజు వేసుకుంటారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రాజకీయ అవసరాలపై కూడా లెక్కలేసుకుని.. ఆ తర్వాతే పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిసింది.ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల భర్తీని కేసీఆర్ వ్యూహత్మకంగానే వాయిదా వేశారన్నది ఆ వాదనల సారాంశం.