సొంత పార్టీలకు షాకిచ్చి గులాబీ కారు ఎక్కిన నేతల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. సీనియర్ కాంగ్రెస్ నేతలు.. కాకా వెంకటస్వామి కుమారులు వివేక్.. వినోద్ లతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరిన నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. వారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా తలుచుకున్నారు.
ఎంపీ గుత్తాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్.. ఆయన తనకెంతో ఆప్త మిత్రుడని.. 1996 ఎన్నికల్లో భాగంగా తామిద్దరం (ఆ రోజుల్లో గుత్తా.. కేసీఆర్ లు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు)శ్రీరామ్ సాగర్ కట్ట మీద కూర్చొని మాట్లాడుకున్న విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రాకు నీరు ఇస్తున్న నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ఉండగా.. ఎస్ ఆర్ ఎస్పీ మాత్రం శివాలయంగా ఉందని తాము చర్చించుకున్నట్లుగా పేర్కొన్నారు.
ఇక.. వివేక్ గురించి మరింత ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. వివేక్ తమతో కలిసి పని చేశారని.. టీఆర్ఎస్ లో కొనసాగిన.. తన తండ్రి వెంకటస్వామి కోరికతో టీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల ముందుకాంగ్రెస్ లోకి వెళ్లే ముందు తనకు చెప్పే పార్టీ మారానని.. ఇష్టం లేకున్నా వివేక్ ఆ రోజున పార్టీ మారారని.. ఈ రోజు తిరిగి రావటం బాగుందని చెప్పుకొచ్చారు.
పాత ముచ్చట్లు చెప్పి.. తాజాగా పార్టీలోకి వచ్చిన వారంతా ప్రత్యర్థులు చెబుతున్నట్లు ఏదో ప్రయోజనాల కోసం కాకుండా.. తమ మధ్యనున్న భావోద్వేగ బంధంతోనే వచ్చినట్లుగా కబుర్లు చెప్పటం కేసీఆర్ కే చెల్లుతుందని చెప్పాలి. ఇప్పుడు పార్టీలోకి వస్తున్న వారంతా.. కేసీఆర్ కు అంత క్లోజ్ అయితే.. ఉద్యమ సమయంలో ఆయనతో ఎందుకు ఉండన్నట్లు..? పవర్ లో ఉండి.. తిరుగులేని నాయకుడిగా అవతరించాక పార్టీలోకి వస్తున్న వారంతా ఎందుకు కారు ఎక్కుతున్నారో ప్రజలు గుర్తించలేనంత అమాయకులా..?