తెలివితేటలన్ని కుప్ప పోస్తే.. అది మోడీషాలు అవుతారా? అన్నట్లుగా వ్యవహరించటం వారికి మామూలే. వ్యూహాత్మకంగా వ్యవహరించి.. రాజకీయ ప్రత్యర్థులకు ఊపిరి ఆడనివ్వని రీతిలో వ్యవహరించటం బీజేపీ అగ్రనేతలకు అలవాటే. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకొని రాజకీయ చమత్కారాన్ని ప్రదర్శించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ ను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
ఎందుకిలా? అంటే.. దానికి కారణాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలోనూ.. తాజాగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారులోనూ మంత్రిమండలిలో మహిళకు చోటు దక్కని సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ వేళలో పురుషులతో సమానంగా కోట్లాడిన మహిళలకు.. తెలంగాణ కేబినెట్ లో చోటు లేకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. కేసీఆర్ వెనక్కి తగ్గింది లేదు. మహిళకుచోటు ఇచ్చింది లేదు.
రానున్న కొద్ది రోజుల్లో మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ.. వారికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళను గవర్నర్ గా ఎంపిక చేయటం ద్వారా.. కేసీఆర్ కంటే ఎక్కువగా మోడీషానే ప్రాధాన్యత ఇచ్చారన్న పేరును తాజా నిర్ణయంతో సొంతం చేసుకున్నట్లే.
అన్నింటికి మించిన తన మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించటానికి కేసీఆర్ కు ఇష్టం ఉండదని చెబుతారు. ఈ కారణంతోనే మహిళా నేతలకు మంత్రి పదవులు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ ను నియమించటం ద్వారా.. తన రాజకీయ ప్రత్యర్థికి ఇరిటేట్ కలిగేలా చేయటంలో మోడీషాలు సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ గవర్నర్ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. ఇలాంటివేళ.. మహిళా గవర్నర్ వద్దకు వెళ్లాల్సి రావటం.. పాలనాపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో గవర్నర్ హోదాలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు ఎక్కువే ఉంటాయి. ఇలాంటివేళ.. తనకు ఏ మాత్రం ఇష్టం లేని రీతిలో ఎంపిక చేసిన గవర్నర్ కింద పని చేయాల్సి రావటం కేసీఆర్ కు ఇబ్బందిగా మారుతుందని చెప్పక తప్పదు. తన రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థులను చిత్తు చేసే కేసీఆర్ కు.. ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మోడీషాల తాజా నిర్ణయం ఉందని చెప్పక తప్పదు.