కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. కానీ.. చేసేస్తుంటారు. కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తే.. మరికొన్నిసార్లు తెలిసి చేసేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అహంభావంతో చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మూడో రకం తప్పును చేయనున్నారా? అంటే అవునన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యున్నత స్థానానికి చేరుకోవటానికి ఎంత కష్టపడతారో.. ఆ స్థానంలో నిలవటానికి అంతకు మించి శ్రమించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ ఇప్పుడా విషయాన్ని మర్చిపోతున్నారని చెప్పాలి.
మోడీషాల కన్ను పడనంత వరకూ ఫర్లేదు కానీ.. ఒకసారి పడిన తర్వాత మరింత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ.. రెండోసారి ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనలో విపరీతమైన ఆత్మవిశ్వాసం వచ్చేసిందన్న మాట గులాబీ నేతల్లోనే వినిపిస్తోంది. మంత్రుల్ని సైతం ఆయన కలవటం లేదన్న ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ముఖ్యమంత్రి అయినప్పటికీ సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన పేరు ఇప్పటికే దేశ ప్రజలకు రిజిష్టరైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తన మంత్రివర్గంలో మేనల్లుడు హరీశ్ కు చోటివ్వని కేసీఆర్.. ఈటెలకు అతి కష్టమ్మీదా ఇచ్చినట్లు చెబుతారు. ఉద్యమ సమయం నుంచి తన వెంటే ఉన్న పద్మారావుకు సైతం డిప్యూటీ స్పీకర్ పదవి అప్పజెప్పి.. మంత్రి పదవి ఊడబీకటంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతారు. ఇక.. కడియం లాంటి వారు.. తమను పక్కన పెట్టటంపై ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తాయి.
ఇలా.. మొదట్నించి తనతో ఉన్న చాలామందికి పదవులు ఇవ్వకుండా ఉండటం.. ఒకవేళ ఇచ్చినా అప్రాధాన్యత పదవుల్లో కూర్చోబెట్టటం లాంటివి చేయటంపై కోపం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాస్ ను ఏమీ అనలేక తమలోపల తామే కుమిలిపోతున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. తాను తీసుకురానున్నకొత్త రెవెన్యూ చట్టంలో కొన్ని లీకులు ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలతో పాటు.. తనకు అనుకూలంగా ఉండే చిన్న పత్రికల్లో మంత్రి ఈటెల రాజేందర్ పదవిని పీకేయనున్నట్లుగా వార్తలు రావటం ఆసక్తికరంగా మారుతోంది. కేసీఆర్ కావాలనే ఆ సిగ్నల్ ఇప్పించినట్లుగా పలువురు వాదిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైన పక్షంలో కేసీఆర్ ఖరీదైన తప్పు చేసినట్లేనన్న మాట వినిపిస్తోంది.
కొన్ని విషయాల్ని టచ్ చేయటానికి మించిన పెద్ద తప్పు ఉండదని.. ఉద్యమ వేళ నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు.. ఉద్యమ వేళలో.. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన ఈటెల లాంటోళ్లను పక్కన పెట్టేయటం.. అవమానానికి గురి చేయటం కేసీఆర్ కే నష్టమంటున్నారు. కేసీఆర్ అండ్ కో అనుమతి లేకుండా వారికి చెందిన మీడియాలో ఈటెల మంత్రి పదవి పోతుందన్న అంచనాలతో భారీ వార్తలు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఏమైనా.. ఈటెల మంత్రి పదవిని పీకేస్తే మాత్రం.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారి వేడెక్కటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.