మార్పు రాత్రికి రాత్రి రాదు. అది అసాధ్యం కూడా. ఒకవేళ.. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేయాలని భావిస్తే దాని కారణంగా చోటు చేసుకునే విపరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి అస్సలు గుర్తించినట్లుగా కనిపించట్లేదు. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను వంద రోజులకు పైనే నిలిపివేసిన ఘనత కేసీఆర్ సర్కారుదే. నిజానికి.. ప్రభుత్వం ఆలోచన మంచి కోసమే. అయితే..ఈ ఆరాటం ప్రజా ప్రయోజనాల్ని భారీగాదెబ్బ తీసేలా మారకూడదు.
తమ ఆస్తుల్ని అవసరాల కోసమో.. ఇతర పనుల కోసమో అమ్ముకునే వారికి.. కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఆంక్షల ఛట్రంలో ఆపేయటంలో అర్థం లేదు. వ్యవసాయేతర ఆస్తుల్ని సరికొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేయాలన్న కేసీఆర్ ఆలోచన మంచిదే అయినా.. ఫాంహౌస్ లో చేసిన ప్లానింగ్ తేడాగా ఉందంటున్నారు. నిజానికి ఒక కొత్త మార్పును ఒక గ్రామం లేదంటే పట్టణం.. కాదంటే నగరంలో శాంపిల్ టెస్టు చేసి.. అక్కడ ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం జరుగుతుంది.
అందుకు భిన్నంగా ఏకాఏకిన రాష్ట్రం మొత్తం రిజిస్ట్రేషన్లు నిలిపేసి.. కొత్త మార్పుల్ని ఒకేసారి తీసుకురావటం అర్థం లేనిది. అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టటం అనే ఆలోచనకు వాస్తవ రూపంగా సరికొత్త రిజిస్ట్రేషన్లుగా చెప్పాలి.దశాబ్దాల తరబడి సాగిన దందాను రోజులో మార్చటం సాధ్యం కాదన్నది కేసీఆర్ కు తెలియనిది కాదు. కానీ.. మొండితనంతో తాను అనుకున్నది ఏదైనా జరిగి తీరాలన్న పట్టుదల తెలంగాణ ముఖ్యమంత్రికి ఎక్కువ. అందుకే.. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ కు ససేమిరా అంటున్న ప్రభుత్వం.. కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మరి.. అదేమైనా సరిగా ఏడ్చి చచ్చిందా? అంటే అదీ లేదు. ఎవరి దాకానో ఎందుకు.. బ్యాంకులు సైతం కొత్త రిజిస్ట్రేషన్ విధానం ప్రకారం అయితే లోన్లు ఇవ్వలేమంటున్నాయి.
దీనికి బోలెడన్ని కారణాలు చూపించటమే కాదు.. దేశంలో మరెక్కడాలేని కొత్త విధానంలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ను ఎత్తి చూపిస్తున్నారు. ఇదే అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించటం.. దీనిపై వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇదంతా ఒక వైపు జరుగుతూ.. పనులు జరిగిపోతుంటే ఫర్లేదు. కానీ.. ఇక్కడ సమస్య ఏమంటే.. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో.. లక్షలాది మంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గడిచిన మూడున్నర నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా ఆగిపోయిన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఏకంగా ఆరేడు లక్షల మధ్య ఉన్నాయని చెబుతున్నారు. ఈ లెక్కన ఎంత టర్నోవర్ ఆగిందో లెక్క వేస్తే..కేసీఆర్ పట్టుదలకు ఇంత భారీ మూల్యం చెల్లించాలా? అన్న సందేహం కలుగక మానదు.
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై హైకోర్టు సాగుతున్న విచారణలో భాగంగా సదరుకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించాలా? అన్న ఆలోచన చేస్తోంది. అలా కాకుండా మరిన్ని విధివిధానాల్ని రూపొందించా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ముందుకు సాగాలా? అన్న అంశంపైనా న్యాయ వర్గాల నుంచి సలహాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆధార్.. కులం.. కుటుంబ సభ్యుల వివరాలు..సామాజిక హోదా తదితర అంశాల్ని తొలగిస్తూ మాన్యువల్ ను సవరించే దాకా వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ను ఆపాలని హైకోర్టు ఆదేశించటం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదంతా చూస్తే.. ఈ లాగుడు.. పీకుడు వ్యవహారంతో ఇప్పటికే భారీగా నష్టం వాటిల్లింది. ఇదే తీరును కొనసాగిస్తే.. మరింత డ్యామేజ్ జరగటం ఖాయమన్న విషయాన్ని కేసీఆర్ ఎప్పటికి గమనిస్తారు? అన్ని ఉన్న మారాజులకు రిజిస్ట్రేషన్లు ఆగటం వల్ల సమస్యలు పెద్దగా ఉండవు. కానీ.. చిన్నా చితక.. మధ్యతరగతి వారికి మాత్రం ఈ వ్యవహారం కోలుకోలేనిదిగా మారుతుందన్నది మర్చిపోకూడదు.