ఎర్రబెల్లి దయాకర్ కారెక్కారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం చెందడంతో ఒక్కొక్కరుగా టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ వైపు మొగ్గుచూపుతున్న వైనం తెలిసిందే. ఎన్నికల తరువాత టీఆర్ ఎస్ చీఫ్ ను కలిసిన ఎర్రబల్లి... తాజాగా కేసీఆర్ సమక్షంలో అఫిషియల్ గా చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నాయకుడి చేరిక చిల్లర రాజకీయం కాదు. తెలంగాణ శక్తులంతా ఎకీకృతం కావాలి. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాకు అన్యాయం జరిగింది. తెలంగాణ అభివృద్ధికోసం ప్రతి ఒక్కరూ చేయి కలపాలని’ కోరారు.
అంతేకాదు... వరంగల్ జిల్లాకు ఏడాదికి రూ.300 కోట్ల చొప్పున ప్రత్యేకంగా కేటాయిస్తామని, సాగునీరందించి... గోదావరి జిల్లాలను తలదన్నే రీతిలో అభివృద్ది చేస్తాం అన్నాడు. దయాకర్ రావు మాట్లాడుతూ ‘తెలంగాణాలో అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలంతా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని’ కోరారు.