ఎవరితోనైనా అవసరం ఉంటే కాస్త వారికి అనుకూలంగా ఉండడం సహజమే.. అలా అని వారు ఏం చేసినా ఊరుకుంటారా ఎవరైనా? అస్సలు ఊరుకోరు. కానీ, టీఆరెస్ పార్టీ మాత్రం ఎంఐఎంతో అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటోంది. చివరకు తమ ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రిపై దాడి చేసినా కూడా కిమ్మనకుండా చూస్తోంది. దీంతో రాజకీయాల్లో అవసరాలు సహజమే కానీ అవసరం చివరికి చేతకానితనం కారాదని అంటున్నారు. ఎంఐఎం తమకు మిత్రుడని నిత్యం కేసీఆర్ చెబుతుంటారు... ఇప్పుడు ఆ మిత్రుడే తన మిత్రుడు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీపై దాడి చేశాడు. అయినా, కేసీఆర్ మాత్రం నీరో చక్రవర్తిలా చూస్తూ ఊరుకుంటున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మజ్లిస్ పార్టీకి అలవాటే.. కానీ, ఈసారి ప్రత్యర్థులతో మిత్రులనూ కొట్టింది మజ్లిస్ పార్టీ. అందుకు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంఐఎం సహజంగానే అధికార పార్టీలతో చెలిమి చేస్తుంది... ఇప్పుడు టీఆరెస్ తోనూ ఆ పార్టీ అనుకూలంగానే ఉంది. అయితే... తమ ఇలాకాలోకి వస్తే మాత్రం ఏమాత్రం సహించబోనని చెప్పేందుకే తాజాగా డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీపై కొద్దికాలంగా ఎంఐఎం మండిపడుతోంది. అలీ తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గం నుంచి రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మలక్ పేట మజ్లిస్ చేతిలో ఉంది. దీంతో తమ నియోజకవర్గంపై కన్నేస్తున్నారన్న కోపంతోనే మలక్ పేట ఎమ్మెల్యే బలాలా టీఆరెస్ తో మిత్రుత్వాన్ని పక్కనపెట్టి మరీ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడికి దిగారు. ఆ సందర్భంగా ఆయన అన్న మాటలే వారిలో ఉన్న రాజకీయ అసహనానికి నిదర్శనం ''నా సహనానికి పరీక్ష పెడుతున్నావ్.. నేనింక సహనంగా ఉండలేను'' అంటూ ఉప ముఖ్యమంత్రిని సైతం ఓ పక్కకు తోసేసి.. ఆయన కుమారుడిపై దాడికి తెగబడ్డారు. విచిత్రమేంటంటే బలాలా, ఆయన అనుచరుల దూకుడు చూసి ఉప ముఖ్యమంత్రికి రక్షణగా నిలిచిన 20 మందికి పైగా భద్రతా సిబ్బంది బెదిరిపోయి పారిపోయారు.
నిజానికి ఇది చాలా తీవ్రమైన అంశం. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిని.. ఆయన ఇంటి మీద దాడి చేస్తే సర్కారు ఉక్కుపాదం మోపాలి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం దానిపై ఏమీ చర్యలు తీసుకోలేదు. దీంతో కేసీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ నేతలను తన్నులు తినేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎంత మిత్రపక్షమైనా కూడా ఇది ఫ్రెండ్లీ ఫైటింగు అనుకోవడానికి పిల్లాటలు కావు రాజకీయాలు అంటున్నారు పరిశీలకులు. మరి గ్రేటర్ రిజల్ట్సు వచ్చాకైనా కేసీఆర్ దీనిపై యాక్షన్ తీసుకుంటారో లేదంటే ఉప ముఖ్యమంత్రికే అమృతాంజన్ కొనిస్తారో చూడాలి.