ఏపీ సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత పదవుల పందేరం వేగవంతం చేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఏపీలో తెలంగాణకు చెందిన నాయకులకు పదవులు ఇచ్చారు. పార్టీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న ఎల్వీఎస్సార్ కే ప్రసాద్ కు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంతకుముందు మరో ముగ్గురు నాయకులకు రాష్ర్టస్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలు ఇపుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సెటిలర్లు అనే పొరుగు రాష్ర్టం ప్రజల విషయంలో తెలంగాణ సీఎం వైఖరి ఏంటనేది ఆసక్తిగా మారింది.
హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లా శివారు నియోజకవర్గాలు కలుపుకొని ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో పాతబస్తీ నియోజకవర్గాలు మినహాయిస్తే...23 నియోజకవర్గాల్లో సెటిలర్ల హవా కొనసాగుతోంది. కూకట్ పల్లి - శేరిలింగంపల్లి - సనత్ నగర్ - ఎల్ బినగర్ - ఉప్పల్ - కుత్బుల్లాపూర్ - రాజేంద్రనగర్ - మలక్ పేట - చేవెళ్ల - అంబర్ పేట - మల్కాజిగిరి వంటి నియోజకవర్గాల్లో సెటిలర్లే విజయనిర్ణేతలు. ఇటీవల సెటిలర్ల ఓట్లు తొలగించారంటూ టీడీపీ - కాంగ్రెస్ లు ఈసీ ఫిర్యాదు చేయడం వెనుక కూడా బలమైన ఓటు బ్యాంకును దక్కించుకోవడమే అసలు కారణం. ఆయా పార్టీల ఫిర్యాదు నేపథ్యంలో ఈసీ స్పందించి, ప్రత్యేక అధికారులను పంపింది. ఫలితంగా, ఓట్లు కోల్పోయిన వారికి మళ్లీ ఓటు హక్కు లభించిన విషయం తెలిసిందే.
కేవలం గ్రేటర్ ఎన్నికల పరంగానే కాకుండా నిజామాబాద్ - ఖమ్మం - రంగారెడ్డిలో అధికశాతం - నల్లగొండ - మహబూబ్ నగర్ లో కొంత శాతం సెటిలర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో గెలుపుతో పాటు - భవిష్యత్తులో టీఆర్ ఎస్ విజయానికి సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. ఎన్నికల ముందు సెటిలర్లపై టీఆర్ ఎస్ కు - టీఆర్ ఎస్ పై సెటిలర్లకు వ్యతిరేక భావన ఉండేది. ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్న తర్వాత, టీఆర్ ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది. సెటిలర్లతో సన్నిహిత సంబంధాలున్న తలసాని శ్రీనివాసయాదవ్ ను క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత టీఆర్ ఎస్ పై సెటిలర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. సనత్ నగర్ లో ఆయన ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లోనూ సెటిలర్లను, కాలనీ సంఘ నాయకులను భాగస్వాములను చేస్తున్నారు. టీడీపీలో కార్పొరేటర్లుగా పనిచేసిన సెటిలర్ నేతలు తలసానితోనే ఉండటం కూడా గమనార్హం.
దానికి తగినట్టే.. తలసాని - తీగల నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్ సెటిలర్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, తమ ప్రభుత్వానికి ఆంధ్రావారి పెట్టుబడులు కూడా కావాలని బహిరంగంగా ప్రకటించారు. అందరితోపాటు వారికీ రెడ్ కార్పెట్ వేస్తామని స్పష్టం చేశారు. సెటిలర్లకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తమదేనని, అసలు వారు సెటిలర్లు కాదని - తెలంగాణ బిడ్డలేనని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా సెటిలర్ల కాళ్లలో ముళ్లుగుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పేంతవరకూ వెళ్లారు.
అధికారం వచ్చిన తర్వాత సెటిలర్లపై టీఆర్ ఎస్ అగ్రనేతల వ్యతిరేక వ్యాఖ్యలు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో హరీష్ రావు వంటి నేతలు ఆ విషయంలో దూకుడుగా వెళ్లినప్పటికీ, 16 నెలల నుంచి వారి వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది. దానికిమించి కేసీఆర్ అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపనకు వెళ్లడం సెటిలర్లలో వ్యతిరేకత స్థానంలో సానుకూలత ఏర్పడింది. ఆ పరిణామం తెలంగాణలో తెలుగుదేశం కంటే, టీఆర్ ఎస్ కే ఎక్కువ లాభించిందని రాజకీయ వర్గాలు సైతం విశ్లేషించాయి. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకూ ఏ ఒక్క సెటిలర్ పైనా దాడులు జరగకపోవడం, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్న ప్రాంతాలపై పక్షపాతం ప్రదర్శించకపోవడం, పైగా వారు మిగిలిన వారికంటే తమకే ప్రాధాన్యం ఇవ్వడంతో సెటిలర్లలో టీఆర్ ఎస్ పై గతంలో ఉన్న వ్యతిరేకత స్థానంలో, సానుకూల ఏర్పడేందుకు కారణమయింది.
తాము సెటిలర్లకు దన్నుగా ఉంటామని, వారు కూడా తెలంగాణ బిడ్డలేనని మాటలతో చెప్పడం కాకుండా, వారిని గౌరవిస్తున్న సంకేతాలు పంపితేనే కేసీఆర్ మాటలకు విశ్వసనీయత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరో మూడునెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున, ఆలోగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఆయన సానుకూలంగా ఉంటే...ఇప్పటికే టీడీపీ - వైసీపీకి చెందిన హైదరాబాద్ - రంగారెడ్డి - ఖమ్మం - నల్లగొండ - నిజామాబాద్ జిల్లాల నాయకుల్లో కొందరికి నామినేటెడ్ పదవులిచ్చే అవకాశాలుంటాయి. తెలంగాణ నేతలకు బాబు పదవులిచ్చిన మాదిరిగానే, కేసీఆర్ కూడా సెటిలర్లకు పదవులిచ్చే అవకాశం ఉందా? అవసరానికి తగిన వ్యూహం పన్నడంలో నేర్పరి అయిన కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.