బీఆర్ఎస్ లో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు గుడ్ బై చెప్పి వెళ్లిపోగా.. మరికొందరు అసమ్మతి నేతలను బీఆర్ఎస్ పార్టీనే పంపించడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మం బీఆర్ఎస్ లో అసమ్మతి రాజేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరడానికి సిద్దమయ్యారు. ఖమ్మం నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ మేరకు పొంగులేటి తీరుపై చర్చించారు. ఇక ఈ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావును కూడా ఆహ్వానించలేదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలినట్టైంది.
పొంగులేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకుండా చూడడంతోపాటు బీఆర్ఎస్ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తుమ్మలను కేసీఆర్ ఆహ్వానించకపోవడంతో ఆయన కూడా బీజేపీలో చేరిపోతారని అందరూ భావిస్తున్నారు.
ఖమ్మంలో విందు రాజకీయం బీఆర్ఎస్ లో సెగలు రేపుతోంది. సత్తా చాటేందుకు సిద్ధమైన తుమ్మల, పొంగులేటి ప్రయత్నించారు. నూతన సంవత్సర వేడుకలు ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి పుట్టించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా విందు రాజకీయాలకు తెర లేపారు.
ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో తుమ్మల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం పార్టీ మార్పుకేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తుమ్మల దాదాపు 350 కార్లతో ర్యాలీగా వాజేడుకు వెళ్లారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈక్రమంలోనే మరోసారి తుమ్మల పార్టీ మార్పుపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాతీసినట్టు తెలిసింది. కొంతకాలం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు.
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాడు ఖమ్మంలో బలమైన నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో తమ్మలు ఓటమి చెందినా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో నాలుగేళ్లు రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగడంతోపాటు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు. పార్టీలో తాను పెంచి పోషించిన నేతలు తన ఓటమికి పనిచేయడంతో 2018 ఎన్నికల్లో మరోసారి తుమ్మల ఓడిపోయాడు. అయితే ఓడిపోయిన నేతలను, ముఖ్యంగా సీనియర్లను రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారు. దీంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారింది. ఆయన బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.