తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతికి ఎముకే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. అడిగిన వారికి, అడగని వారికి ఆయన విరాళల వెల్లువను కొనసాగిస్తున్నారు. ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో భాగ్యనగరంలో హామీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇందుకు మరో కొత్త కోణాన్ని జోడించారు కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 19.95 లక్షల ఆహార భద్రత (రేషన్) కార్డులున్నాయి. మరో 33 వేల కుటుంబాలకును ఈ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రేషన్‌కార్డుల సంఖ్య 20.28 లక్షలకు చేరినట్లయింది. తాజాగా మంజూరు చేసిన కార్డుదారులకు వచ్చే జూన్ నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కొత్తగా అధికారంలో వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఆహార భద్రత పథకం కింద కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించడంతో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 23.39 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. మొదటగా పాత కార్డుదారులైన 14.20 లక్షల కుటుంబాలను ఆధార్‌తో అనుసంధానం చేసి కార్డులు మంజూరు చేశారు. తొలి విడతగా సుమారు 18.84 లక్షల కుటుంబాలకు కార్డులు మంజూరయ్యాయి. ఆ తర్వాత కూడా దరఖాస్తుల పరంపరం కొనసాగుతుండటంతో కార్డుల మంజూరు సంఖ్య ఏప్రిల్ నాటికి 19.49 లక్షలు, మే నాటికి 19.95 లక్షలకు చేరింది. మరో లక్ష కుటుంబాల దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ అధికారులు దశల వారిగా క్షేత్ర స్థాయి విచారణ కొనసాగిస్తూ వస్తున్నారు. మొత్తం మీద తాజాగా మరి కొన్ని కుటుంబాలకు కార్డులు మంజూరయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గ్రౌండ్ వర్క్ లో భాగంగానే ఈ సకరత్తుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని చెప్పక తప్పదు. మిగతా ఏ జిల్లాలోనూ ఇవ్వని అనుమతిని కేవలం ఒక్క హైదరాబాద్ కు ఇవ్వడంలో మర్మం అదేనని వ్యాఖ్యానిస్తున్నారు.