దాదాపు ఏడాది క్రితం.. గ్రేటర్ ఎన్నికల వేళ.. జర్నలిస్టులకు వెండితెర మీద వరాల చిత్రాన్ని చూపించారు. హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్టులకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల మీద ఆయన తనదైన శైలిలో హామీ ఇచ్చారు. స్థలాల ముచ్చట కాదు కానీ.. ఫ్లాట్లు ఇచ్చేస్తామని ప్రకటించారు. మిగిలిన వారి మాదిరి డబుల్ బెడ్రూం ఇల్లు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి.. తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ట్రిపుల్ బెడ్రూం ఇస్తానని ప్రకటించారు.
గ్రేటర్ ఎన్నికలు పూర్తి అయిపోయిన వెంటనే.. ట్రిపుల్ బెడ్రూం పనులు మొదలుపెడదామని కేసీఆర్ చెప్పారు. వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశాల నేపథ్యంలో జర్నలిస్టుల చిరకాల డిమాండ్ అయిన ‘ఇంటి కల’ కేసీఆర్ పుణ్యమా అని తీరిపోనుందని భావించారు. ఇందుకు తగ్గట్లే పగటి కలలు కనటం షురూ చేశారు. ట్రిపుల్ బెడ్రూం ఇంటిపై కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఒక్క అడుగుముందుకు పడలేదు సరికదా.. ఇప్పుడా ఇష్యూను మంత్రి కేటీఆర్ చూస్తున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు.
మిగిలిన వారికి ఇచ్చే వరాల అమలుకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వాదించొచ్చు.కానీ.. హైదరాబాద్ లోని జర్నలిస్టులకు ఇళ్లు ఇప్పించాలన్న ఇష్యూ ఏడాదిగా నలుగుతున్నా.. ఎలాంటి అడుగు ముందుకు పడకపోవటం చూస్తే.. జర్నలిస్టుల పక్షపాతిగా తనను తాను చెప్పుకునే కేసీఆర్ కు.. అలాంటిదేమీ లేదన్న భావన కలగటం ఖాయం. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే.. దిక్కుమాలిన ఆంధ్రా సర్కారు పోతుంది కాబట్టి.. తెలంగాణలోని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం పక్కా అంటూ లక్షల సార్లు కేసీఆర్ అండ్ కో చెప్పటాన్ని మర్చిపోలేం. ఇంటికో ఉద్యోగం అన్న విషయాన్ని ఎంత నమ్మకంగా చెప్పారో.. జర్నలిస్టులకు ఇళ్ల విషయంలోనూ అంతే నమ్మకంతో మాట ఇచ్చారని చెప్పాలి. రెండూ రెండే అన్నరీతిలో ఇంటికో ఉద్యోగమేకాదు.. జర్నలిస్టులకు ఇళ్లు వచ్చింది కూడా లేదు.
ఇంటి విషయాన్నిమంత్రి కేటీఆర్ చూస్తున్నారంటూ ఇష్యూను పక్కన పెట్టేసిన కేసీఆర్.. ఆ వాగ్దాన భంగం తాలూకు సెగ తనకు తగలకుండా ఉండేందుకు కాస్తంత తెలివిగా కొన్ని కొసరు వరాల్ని ప్రకటించారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయిల ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. మృతుల కుటుంబాలకు నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ సౌకర్యాన్ని ఐదేళ్ల పాటు ఇస్తామని ప్రకటించారు.
తన బర్త్ డే సందర్భంగా (ఈ నెల 17న) తన అధికారనివాసంలో నిర్వహించే జనహిత కార్యక్రమంలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలతో కేసీఆర్ తొలి భేటీ కానున్నారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబంలో పదో తరగతి లోపు చదివే పిల్లలు ఉంటే.. ఇద్దరుపిల్లల వరకూ ఒక్కొక్కరికి వెయ్యి రూపాయిలచొప్పున ఆర్థిక సాయంతో పాటు.. ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు చేయూతను ఇచ్చేలా వరాలు ప్రకటించిన కేసీఆర్..బతికున్న జర్నలిస్టుల సంగతి కూడా కాస్త చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా.. మిగిలిన వారికి.. జర్నలిస్టులకు తనకు ఇ స్పెషల్ ఎంత మాత్రం కాదన్న విషయాన్ని కేసీఆర్ తన చేతలతో చేసి చూపించారని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/