కేసీఆర్ బ‌రి!... క‌రీంన‌గ‌ర్ టూ న‌ల్ల‌గొండ‌!

Update: 2019-01-05 15:56 GMT
టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు జాతీయ రాజ‌కీయాల‌పై అమితాసక్తి క‌న‌బ‌రుస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కొత్త రాష్ట్ర తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ స్ప‌ష్ట‌మైన మెజారిటీతో విజ‌యం సాధించిన కేసీఆర్‌... రాష్ట్రానికి తొలి సీఎంగానే కాకుండా రెండో సీఎంగానూ త‌న పేరును లిఖించేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగానే జాతీయ రాజ‌కీయాల‌పైకి దృష్టి సారించిన కేసీఆర్‌... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌తో కూడిన కూట‌ముల‌కు ప్ర‌త్యామ్నాయంగా తృతీయ కూట‌మిని ఏర్పాటు చేస్తానంటూ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే ప‌లు రాష్ట్రాల‌కు వెళ్లి వ‌చ్చిన కేసీఆర్‌... ఆయా రాష్ట్రాల్లోని కీల‌క రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో కేసీఆర్‌ కు పెద్ద‌గా సానుకూల ఫ‌లితాలు రాలేద‌న్న వాద‌న సాగుతున్నా... ఇప్పుడిప్పుడే మొద‌లెట్టిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ కు అప్ప‌టిక‌ప్పుడే ఎలా బలం వ‌స్తుంద‌న్న కోణంలో విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్న కేసీఆర్‌.. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌భావం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ ను సక్సెస్ ఫార్మ్యూలాలోకి న‌డిపించేందుకు గానూ... రాష్ట్ర పాల‌నా ప‌గ్గాల‌తో పాటు పార్టీ వ్య‌వ‌హారాల‌ను కూడా కొడుకును క‌ట్ట‌బెట్టేసి... జాతీయ రాజ‌కీయాల్లోకి పూర్తిగా దిగిపోవాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. మొన్నామ‌ధ్య ఢిల్లీ టూర్‌ లో ఏకంగా అక్క‌డ పార్టీ కార్యాల‌యం ఏర్పాటు కోసం ఏకంగా స్థ‌ల ప‌రిశీల‌న కూడా చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. అంతేకాకుంగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ గా ఎంపీగా బ‌రిలోకి దిగ‌బోతున్నార‌ని, ఆ పోటీ కూడా త‌న‌కు అచ్చి వ‌చ్చిన క‌రీంన‌గ‌ర్ నుంచేన‌ని కూడా వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పోటీకి సంబంధించి ఇప్పుడు ఓ వాద‌న వినిపిస్తోంది. గ‌తంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు ఒక్కోసారి ఒక్కో స్థానం నుంచి బ‌ర‌లోకి దిగారు. ఓ సారి మెద‌క్ స్థానం నుంచి బ‌రిలోకి దిగితే... మ‌రోమారు క‌రీంన‌గ‌ర్ నుంచి, ఆ త‌ర్వాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి ఆయ‌న ఎంపీగా పోటీ చేశారు.

ఈ ద‌ఫా కూడా ఎంపీగా పోటీ చేయాల‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్న కేసీఆర్ ఈ మూడు స్థానాలు కాకుండా ఓ కొత్త స్థానం నుంచి పోటీ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ త‌ర‌హా వ్యూహంతో స‌ద‌రు కొత్త నియోజక‌వ‌ర్గం నుంచి తాను పోటీ చేస్తే... ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉన్న జిల్లా మొత్తంగా పార్టీ మ‌రింత బ‌లోపేత‌మ‌వుతున్న‌ద‌న్న‌ది కేసీఆర్ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ స‌మాలోచ‌న‌ల్లో భాగంగా కేసీఆర్‌... ఈ ద‌ఫా న‌ల్ల‌గొండ లోక్ స‌భ స్థానాన్ని త‌న పోటీకి ఎంచుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానుండ‌గా.. ఆ లోగానే త‌న పోటీ విష‌యంపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇస్తార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.






Full View
Tags:    

Similar News