ఆ స్వాములోరంటే సారుకు ఎంత భ‌క్తంటే?

Update: 2019-06-27 05:02 GMT
న‌మ్మ‌కం కావొచ్చు.. సెంటిమెంట్ కావొచ్చు.. మ‌రింకేదైనా కావొచ్చు.. స్వాములంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఎంత భ‌క్తో ప్ర‌త్యేకంగా చెప్పొచ్చు. ఆ మ‌ధ్య వ‌ర‌కు చిన‌జీయ‌ర్ స్వామికి ఇచ్చిన ప్ర‌యారిటీ అంతా ఇంతా కాదు. ఆయ‌న‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌కు ఇచ్చే ప్ర‌యారిటీ మామూలుగా ఉండేది కాదు. ఇటీవ‌ల కాలంలో ఈ విష‌యంలో కొంత మార్పు వ‌చ్చింద‌న్న మాట వినిపిస్తోంది.

ఆ మ‌ధ్య‌న కేసీఆర్ కు మీరు చెప్పండి స్వామి.. మీ మాట మాత్ర‌మే వింటారంటూ రెవెన్యూ అధికారులు జీయ‌ర్ స్వామిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల విన‌తిప‌త్రాన్ని ఇవ్వ‌టం.. ఆయ‌న అందుకు ఓకే చెప్ప‌టం తెలిసిందే. ఆ త‌ర్వాత నుంచి బ‌య‌ట‌వారికి తెలీని రీతిలో దూరాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తూ ఇటీవ‌ల కాలంలో విశాఖ శార‌దాపీఠం స్వ‌రూపానందకు భారీ ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌టం తెలిసిందే.

ఆయ‌న పీఠానికి చెందిన ఉత్త‌రాధికారి ప‌రిచ‌య కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ విజ‌య‌వాడ‌కు వెళ్లారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికే ఆ రోజు ఏపీ సీఎం జ‌గ‌న్ తో  భేటీ కార్య‌క్ర‌మాన్ని ఫిక్స్ చేసుకున్న‌ట్లుగా మాట వినిపిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న వారు కొంద‌రు స్వాముల‌తో స‌న్నిహితంగా ఉండ‌టం.. ప‌లు సంద‌ర్భాల్లో వారి స‌ల‌హాల్ని అడ‌గ‌టం తెలిసిందే.

అయితే.. గ‌తంలో ఎప్పుడూ.. ఎక్క‌డా లేని రీతిలో తాజాగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. జ‌ల‌విహార్ లో జ‌రిగిన ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో స్వారూపానంద‌తో పాటు శార‌దాపీట ఉత్త‌రాధికారిగా ఎంపిక చేసిన స్వాత్మ‌నందేంద్ర స్వామిజీల‌కు పుష్పాభిషేకాన్ని నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిధిగా హాజ‌రైన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కార్య‌క్ర‌మానికి ఐదు నిమిషాల ముందే చేరుకోవ‌టం విశేషం.

ఇదంతా  ఒక ఎత్తు అయితే.. ఇద్ద‌రు స్వామీజీల‌ను తాను స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన తీరు చూస్తే.. స్వాములోరి మీద త‌న‌కెంత ముఖ్య‌మన్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. సాధార‌ణంగా ముఖ్య‌మంత్రి స్థాయిలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఆయ‌నే ఆఖ‌రుగా వ‌స్తారు. అంద‌రూ స్వాగ‌తం ప‌లుకుతారు. తాజా ఉదంతంలో మాత్రం కేసీఆర్ ముందొచ్చి.. స్వాములోళ్లు త‌ర్వాత రావ‌టం.. వారికి సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ స్వ‌యంగా స్వాగ‌తం పల‌క‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News