మిష‌న్ 16లో భాగంగా కేసీఆర్ అలా చేస్తార‌ట‌!

Update: 2019-01-26 08:14 GMT
వ్యూహాలు రూపొందించ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా సాధించాల్సిన ల‌క్ష్యాన్ని సాధించేందుకు అవ‌స‌ర‌మైన ప‌నిని ద‌శల వారీగా చేయ‌టంతో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. మ‌రో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఉన్న లోక్ స‌భ స్థానాల్లో 16 స్థానాల్లో విజ‌యం సాధించేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల్ని కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.

ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేశారో.. ఇంచుమించుఅదే వ్యూహాన్ని మ‌రోసారి ఓట‌ర్ల మీద ప్ర‌యోగించేందుకు కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల్ని.. వాటి ద్వారా ల‌బ్థి పొందిన వారి వివ‌రాల్ని ఏర్చికూర్చి..ఓట‌ర్ల‌కు లేఖ రాయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఓట‌ర్ల‌కు నేరుగా లేఖ రాయ‌టంతో పాటు.. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల కార‌ణంగా ఎన్ని కుటుంబాలు ల‌బ్థి పొందాయ‌న్న విష‌యాన్ని అంకెల రూపంలో చెప్పేలా ప్లాన్ సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిరంత‌ర విద్యుత్ అంశాన్ని హైలెట్ చేయ‌టంతో పాటు.. ప‌లు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయ‌ని.. ఇలాంటి వేళ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌బాబు జోక్యంతో రాష్ట్రం ఆగ‌మాగం అవుతుంద‌న్న మాట‌ను చెప్ప‌టం తెలిసిందే.

కేసీఆర్ చెప్పిన మాట‌ల్ని తెలంగాణ ఓట‌ర్లు బ‌లంగా న‌మ్మ‌టంతో పాటు.. ఆయ‌న వెంట తామున్నామ‌న్న విష‌యాన్ని ఓట్ల రూపంలో వేసి చూపించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన మేజిక్ ను లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ రిపీట్ చేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌.. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా లేఖ‌ను సిద్ధం చేయ‌టంతో పాటు.. అందులోని అంకెల‌తో వారు సంతృప్తి చెందేలా డేటాను రెఢీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌ల గంట మోగ‌టం ఆల‌స్యం.. ఓట‌ర్ల మ‌న‌సు గెలుచుకునే అస్త్రాల‌న్నీ కేసీఆర్ సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News