మ‌రో మ‌హ‌త్త‌ర యాగానికి కేసీఆర్ సిద్ధం!

Update: 2018-12-24 05:44 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఆధ్యాత్మ‌క‌ భావ‌న‌లు అధికం. భ‌క్తి మార్గంలో న‌డిచేందుకు ఆయ‌న ప్రాధాన్య‌మిస్తారు. నిరంత‌రం ఏదో ఒక పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూనే ఉంటారు. సీఎం అయ్యాక తెలంగాణ‌లో దేవాల‌యాల అభివృద్ధికి ఆయ‌న పెద్ద పీట వేశారు. యాదాద్రిని తిరుమ‌ల త‌ర‌హాలో తీర్చిదిద్దేందుకు వ్యూహ ర‌చ‌న చేశారు. అక్క‌డ ప‌నులు ప్ర‌స్తుతం వాయువేగంగా జ‌రుగుతున్నాయి.

స‌మాజ శ్రేయ‌స్సు కోసం చేసే యాగాలంటే కూడా కేసీఆర్ కు మ‌క్కువ‌. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న కొన్ని యాగాలు చేశారు. ప్ర‌త్యేక రాష్ట్రం సిద్ధించాల‌ని పూజ‌లు చేశారు. తెలంగాణ ఆవిర్భ‌వించి సీఎం బాధ్య‌త‌లు చేప‌ట్టాక 2015 డిసెంబరులో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహించారు కేసీఆర్‌. అదో అద్భుత ఘ‌ట్టం. యాగ కార్యాన్ని వీక్షించి దైవాశీస్సులు పొందేందుకు దేశ‌వ్యాప్తంగా తెలంగాణ న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు విచ్చేశారు. ప‌లు ఇత‌ర రాష్ట్రాల నుంచీ ప్ర‌ముఖులు వ‌చ్చారు. యాగం నిర్వ‌హించిన తీరును చూసి ఆహా అన్నారు. తెలంగాణ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం రెండు రోజుల ముందు కూడా కేసీఆర్ త‌న‌ వ్యవసాయ క్షేత్రంలో రెండు రోజులపాటు రాజశ్యామల యాగం జరిపారు. గులాబీ ద‌ళ‌ప‌తి మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠ‌మెక్క‌డంలో ఆ యాగం పాత్ర కీల‌క‌మ‌ని ఆధ్యాత్మిక వేత్త‌లు చెబుతున్నారు.

2015లో ఆయుత చండీయాగం తర్వాత సహస్ర ఆయుత చండీ మహాయాగం నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్రస్వామితో ఏకాంతంగా జరిపిన చర్చల్లో ఈ యాగం ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో అనుకున్న దాని ప్ర‌కారం దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సహస్ర ఆయుత చండీ మహాయాగం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. వీలును బ‌ట్టి యాగం ఎప్పుడు నిర్వ‌హించాలో ఆయ‌న త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తార‌ని తెలిసింది.


Tags:    

Similar News